ఐసీసీ లీగ్ లో యూఏఈకి ఝలక్కిచ్చిన నేపాల్‌!

అవును, ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌కప్‌ లీగ్ టూ 2019-23లో భాగంగా యూఏఈతో జరిగిన వన్డే మ్యాచ్‌లో నేపాల్‌ సంచలన విజయం నమోదు చేసి యూఏఈకి షాకిచ్చిందని చెప్పుకోవాలి.ఈ లీగ్‌లో భాగంగా జరిగిన చివరి మ్యాచ్‌లో యూఏఈ ఘోరంగా అపజయం పాలైంది.

 Nepal Beat The Uae In The Icc League, Uae, Nepal, Shock, Ipl, Latest News, Sport-TeluguStop.com

నేపాల్ నిన్న మ్యాచ్‌లో రెచ్చిపోయి ఏకంగా 177 పరుగుల భారీ తేడాతో విజయ దుందుభి మ్రోగించింది.నేపాల్‌తో పోలిస్తే అన్ని విభాగాల్లో కూడా యూఏఈ కాస్త పటిష్టంగా ఉందనే అందరికీ తెలుసు.

ఇక కీర్తిపూర్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బౌలింగ్‌ చేసి నేపాల్‌ను 248 పరుగులకు ఆలౌట్‌ చేసింది యూఏఈ.నేపాల్‌ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ అయినటువంటి రోహిత్‌ పౌడెల్‌ 77 కొట్టి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించాడు.

అదే విధంగా భిమ్‌ షార్కీ 29, ఆరిఫ్‌ షేక్‌ 43, దీపేంద్ర సింగ్‌ 34, గుల్సన్‌ ఝా 37 కొట్టి టీమ్ కి బలం చేకూర్చారని చెప్పుకోవచ్చు.ఇక యూఏఈ బౌలర్ల విషయానికొస్తే ఆఫ్జల్‌ ఖాన్‌ అదరగొట్టాడని చెప్పుకోవచ్చు.

ఇతని బౌలింగ్లో కేవలం 47 రన్స్ కి గాను 2 వికెట్లు పడగొట్టడం విశేషం.అదేవిధంగా ఆర్యన్‌ ఖాన్‌(Aryan Khan) (1/28), జునైద్‌ సిద్దిఖీ(Junaid Siddiqui) (1/49), ముస్తఫా(Mustafa) (2/61), జహూర్‌ ఖాన్‌(Zahoor Khan) (2/35), జవార్‌ ఫరీద్‌ (2/9) వికెట్లు పడగొట్టారు.

ఆ తరువాత 249 పరుగుల కనీస లక్ష్యఛేదనకు దిగిన యూఏఈ.దానిని ఛేదించడంలో తడబడిందనే చెప్పుకోవాలి.ఎందుకంటే 22.5 ఓవర్లలో 71 పరుగులకే చేతులెత్తేసింది.ఇక్కడ నేపాల్‌ బౌలర్ల గురుంచి చెప్పుకోవాలి.మనోళ్లు రెచ్చిపోయారు.

ఈ క్రమంలో లలిత్‌ 20 పరుగులిచ్చి ఏకంగా 5 వికెట్లు పడగొట్టడం విశేషం.అదేవిధంగా సోమ్‌పాల్‌ (1/6), సందీప్‌ లమిచ్చాన్‌ (2/14), దీపేంద్ర సింగ్‌ (1/15), గుల్సన్‌ ఝా (1/15)ల ధాటికి యూఏఈ ఇన్నింగ్స్‌లో అయాన్‌ అఫ్జల్‌ (29), అష్వంత్‌ చిదంబరం (14), కార్తీక్‌ మెయ్యప్పన్‌ (11) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు.

లీగ్‌లో భాగంగా ఇరు జట్లు మార్చి 16న మరోసారి తలపడనున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube