టిఎస్పిఎస్సి చైర్మన్ ప్రశ్నాపత్రాల లీక్ లో ప్రమేయం ఉన్న అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జింక అనిల్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాదిమంది తెలంగాణ నిరుద్యోగుల, యువకుల, విద్యార్థుల జీవితాలకు ముడిపడినటువంటి ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష పత్రాలు లీక్ కావడాన్ని భారతీయ జనతా యువమోర్చా తీవ్రంగా ఖండిస్తోందన్నారు.
వందలాది మంది యువకులు, విద్యార్థుల ప్రాణ త్యాగంతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సకాలంలో ఉద్యోగ ఖాళీలను గుర్తించి ఉద్యోగం నోటిఫికేషన్ ఇవ్వడంలో ఘోరంగా విఫలమైన టీఎస్పీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్లలో తప్పుడు ప్రశ్నలు,నియమాలు, నిబంధనలను తప్పులు తడకగా మార్చి, గ్రామీణ పేద విద్యార్థులు, అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తూ చివరికి కనీసం ప్రశ్న పత్రాలను రక్షించడంలో తమ చేతగానితనాన్ని అలసత్వాన్ని బహిర్గతం చేశారు.
బీజేవైఎం ఎన్నో పోరాటాల ఫలితంగా లేకలేక వచ్చిన నియామకాల ప్రక్రియ పరీక్ష పత్రాలు లీక్ అవ్వడాన్ని భారతీయ జనతా యువమోర్చా తీవ్రంగా ఖండిస్తూ ఘటనకు నైతిక బాధ్యత వహించి చైర్మన్ జనార్దన్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని ప్రశ్నాపత్రాల లీక్ లో నిర్లక్ష్యం వహించిన అధికారులను సస్పెండ్ చేయాలని బీజేవైఎం డిమాండ్ చేస్తుందన్నారు.
బోర్డు తీరు, వ్యవస్థ చూస్తే ఈ రెండు పరీక్షలు మాత్రమే కాకుండా గతంలో జరిగినటువంటి పరీక్షల మీద కూడా అనుమానాలకు తావిస్తోందన్నారు.
నిరుద్యోగుల,అభ్యర్థుల, భవిష్యత్తును, జీవితాలను అన్యాయం చేస్తూ కుటుంబాలను ఆగం పట్టించే విధంగా వ్యవహరిస్తున్న టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి బోర్డు సిబ్బంది అధికారుల పాత్ర మీద సమగ్ర విచారణ జరిపించాలని అందులో ప్రమేయం ఉన్నటువంటి అధికారుల మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే టీఎస్పీఎస్సీ కి సంబంధించిన చైర్మన్, లీక్ లో ప్రమేయం ఉన్న అధికారులను బాధ్యతలు నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు, పోరాటాలు చేపడుతామని హెచ్చరిస్తున్నామని తెలిపారు.







