టీడీపీ నేత బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కారణంగానే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిందని తెలిపారు.
గుండెపోటుతో వివేకా చనిపోయారని ప్రచారం చేసిన ఎంపీ విజయసాయిరెడ్డిని సీబీఐ విచారించాలని డిమాండ్ చేశారు.జగన్ కు ధైర్యం ఉంటే అవినాశ్ రెడ్డిని పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని తెలిపారు.
అదేవిధంగా వివేకా కూతురు, అల్లుడుకు కేంద్రం భద్రత కల్పించాలని కోరారు.రానున్న ఎన్నికల్లో వివేకా హత్య ఎజెండాతో ఎన్నికలకు వెళ్తామని బుద్ధా వెంకన్న స్పష్టం చేశారు.