ఒకానొక సమయంలో మహేష్ బాబు.ఎన్టీఆర్.
రామ్ చరణ్.చిరంజీవి వంటి స్టార్ హీరోలతో సినిమా లు తెరకెక్కించిన దర్శకుడు శ్రీను వైట్ల ఇప్పుడు అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు.
ప్రస్తుతం సినిమా ప్రారంభించాలని ప్రయత్నాలు చేస్తున్నా కూడా సాధ్యం అవ్వడం లేదు.ఆ మధ్య తాను చేసిన ఢీ సినిమా కు సీక్వెల్ ను ప్రకటించాడు.
మంచు విష్ణు(Manchu Vishnu) హీరోగా ఆ సీక్వెల్ ను అధికారికంగా ప్రకటిస్తున్నట్లుగా ప్రకటించిన శ్రీను వైట్లకు(Srinu vaitla) పాపం షాక్ తగిలింది.ఆ సినిమా క్యాన్సిల్ అయ్యిందనే వార్తలు వస్తున్నాయి.
గత కొన్ని నెలలుగా ఆ సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్ లేక పోవడంతో సినిమా గురించి ఎంక్వైరీ చేయగా మొత్తానికి క్యాన్సిల్ అయ్యిందనే ప్రచారం జరుగుతోంది.అతి త్వరలోనే సినిమా గురించి కూడా జనాలు మర్చి పోయే అవకాశాలు ఉన్నాయి.
పాపం శ్రీను వైట్ల కెరీర్ ఎక్కడి నుండో ఎక్కడికో అన్నట్లుగా దిగజారింది అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఒకానొక సమయంలో శ్రీను వైట్లను స్టార్ గా అభివర్ణించిన వారు ఆయన గురించి కనీసం మాట్లాడటం లేదు.అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న దర్శకుడు శ్రీను వైట్ల గురించి ఆయనతో వర్క్ చేసిన వారు కూడా పట్టించుకోవడం లేదు.ఆ మధ్య రవితేజ అవకాశం ఇచ్చాడనే వార్తలు వచ్చాయి.
కానీ అది కూడా పుకార్లే అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.ప్రస్తుతం కొత్త కథలతో యంగ్ హీరోలను సంప్రదించేందుకు శ్రీను వైట్ల ప్రయత్నిస్తున్నాడట.
ఆ ప్రయత్నాలు ఎంత వరకు సఫలం అవుతాయి అనేది చూడాలి.గతంలో రామ్ చరణ్ తో చేసిన బ్రూస్ లీ(Bruce Lee) మరియు మహేష్ బాబు తో చేసిన ఆగడు సినిమా లు డిజాస్టర్ గా నిలిచాయి.
కనుక ఆయన కెరీర్ ఒక్కసారిగా తలకిందులయ్యింది.







