పిల్లల్ని కనడం ఎలాగో నేర్పడం ఏమిటి, పిచ్చికాకపోతే? అని ఆశ్చర్యపోవద్దు.మీరు విన్నది నిజమే.
జపాన్(Japan) పరిస్థితి అలాంటిది మరి.గత కొన్ని దశాబ్దాలుగా జపాన్ లో జననాల రేటు భారీగా పడిపోతున్న సంగతి అందరికీ తెలిసినదే.గత ఏడాది ఇది ఆల్ టైం కనిష్టానికి చేరుకున్నవేళ జపాన్ అధిష్టానం గుండెల్లో గుబులు పుట్టింది.మరికొన్నేళ్లు ఇదే పరిస్థితి కొనసాగితే.జపాన్ తన ఉనికిని కోల్పోతుందని అంచనా వేసుకున్నారు.అందుకే దానికోసం రకరకాల పద్ధతులు ప్రవేశపెట్టినట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే జపాన్ లోని చిన్న నగరంలో మాత్రం పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని తెలుస్తోంది.విషయం ఏమంటే దేశంలోని జననాల రేటుతో పోల్చితే ఈ పట్టణంలో జననాల రేటు రెండింతలు ఎక్కువగా ఉన్నట్టు తెలుసుకున్నారు.దీనికి ఈ పట్టణ ప్రజలు అనుసరిస్తున్న విధివిధానాలు కారణమని తెలుస్తుంది.అవును, జపాన్ లోని నాగీ(Nagi) అనే చిన్న పట్టణంలో తమ జనాభాను అంతకంతకూ పెంచుకుంటూ పోతోంది.
దాదాపు 6000 మంది జనాభా కలిగిన ఈ ప్రాంతంలో.దేశంలో కంటే రెండు రెట్లు అధిక జననాల రేటు నమోదవుతోంది.
ఇక్కడ ఏ ఇంట్లో చూసినా ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువ మంది పిల్లలు కనిపించడం ఈ నగరం దేశ వ్యాప్తంగా వార్తల్లో నిలుస్తోంది.దాంతో దేశ నలుమూలల నుంచే కాకుండా విదేశీ పర్యటకులను కూడా ఈ నాగీ పట్టణం విపరీతంగా ఆకర్షిస్తోంది.తమ కుటుంబాలను చూడటానికి వచ్చే పర్యాటకుల వద్ద నుంచి ప్రత్యేక రుసుం కూడా వసూలు చేస్తుందీ ఈ పట్టణం.విషయం ఏంటంటే.ఇక్కడి డేకేర్ సెంటర్లు(Daycare center) సైతం పిల్లల్ని కనడాన్ని ప్రోత్సహించే విధంగానే ఉంటాయి.భార్యభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్న కుటుంబంలో అయితే.
వారి మొదటి బిడ్డను చూసుకునే డేకేర్ సెంటర్ కు నెలకు 420 డాలర్లను చెల్లిస్తారు.దాంతో ఆ దేశ మిగతా ప్రాంతాల ప్రజలు ఆ నగరానికి క్యూలు కడుతున్నారు.