రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీకి ఆస్కార్ అవార్డ్ వస్తుందో రాదో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.మన దేశానికి చెందిన ప్రతి ఒక్కరూ ఈ సినిమాకు ఆస్కార్ రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.
నాటు నాటు సాంగ్ కు చరణ్, తారక్ డ్యాన్స్ చేస్తారని ఫ్యాన్స్ ఆశించినా ఫ్యాన్స్ కోరిక నెరవేరే అవకాశం లేదని, డ్యాన్స్ ప్రాక్టీస్ చేయలేదని తారక్ స్పష్టత ఇచ్చారనే సంగతి తెలిసిందే.
అయితే ఆస్కార్ వేదికపై(oscar award ) అమెరికా అమ్మాయి ఒకరు నాటు నాటు సాంగ్ కు డ్యాన్స్ చేయనున్నారు.
లారెన్ గాట్లీబ్ అనే అమెరికన్ నటి(lauren gottlieb) ఈ సాంగ్ కు లైవ్ పర్ఫామెన్స్ ఇవ్వనున్నారు.సోషాల్ మీడియా వేదికగా ఆమె ఈ విషయాన్ని ధృవీకరించారు.
ఆమె సోషల్ మీడియా పోస్ట్ లో స్పెషల్ న్యూస్.నేను ఆస్కార్ లో నాటు నాటు సాంగ్ కు డ్యాన్స్ పర్ఫామెన్స్ చేస్తున్నా.
ప్రపంచ ప్రఖ్యాతి వేదికపై ఇండియాను రిప్రజెంట్ చేయడం సంతోషంగా ఉందని ఆమె అన్నారు.

లారెస్ గాట్లీబీ పలు హిందీ సినిమాలలో(Bollywood) నటించడం ద్వారా పాపులారిటీని అంతకంతకూ పెంచుకుంటున్నారు.ఆస్కార్ వేదికపై లారెస్ అద్భుతంగా డ్యాన్స్ చేస్తే మాత్రం ఆమె పాపులారిటీ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది.లారెస్ గాబ్లిటీ హిందీలో కూడా పలు క్రేజీ ఆఫర్లను సొంతం చేసుకుంటున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ఆర్ఆర్ఆర్(RRR) మూవీకి అవార్డ్ వస్తే రాబోయే రోజుల్లో తెలుగు సినిమాలకు మరిన్ని అవార్డులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది.ఆర్ఆర్ఆర్ మూవీ కి అవార్డ్ వస్తే ఎన్టీఆర్, చరణ్, జక్కన్న సినిమాలకు మార్కెట్ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి.రాజమౌళి ఆస్కార్ కోరిక నెరవేరాలని ఆశిద్దాం.రాజమౌళి తర్వాత సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.







