అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తెలుగులో ఎన్టీఆర్ కి జోడిగా నటించబోతున్న విషయం తెలిసిందే.రెండు మూడు సంవత్సరాలుగా ఈమె టాలీవుడ్ ఎంట్రీ గురించి సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.
హీరోయిన్ గా తెలుగు లోనే ఈమెని పరిచయం చేయాలని పలువురు నిర్మాతలు భావించారు.కానీ కొన్ని కారణాల వల్ల శ్రీదేవి ఈమెని హిందీ లోని పరిచయం చేయాలని అనుకుంది.
హిందీలో పలు సినిమా ల్లో నటించడంతో పాటు సిరీస్ ల్లో కూడా కనిపించింది.ఎట్టకేలకు తెలుగు లో ఈ అమ్మడు ఎంట్రీ ఇవ్వబోతుంది.
బాలీవుడ్ లో సక్సెస్ సొంతం చేసుకోలేక పోయినా జాన్వీ కపూర్ టాలీవుడ్ లో కచ్చితంగా భారీ విజయాలను నమోదు చేయబోతుందని నమ్మకాన్ని సినీ ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు.

ఎన్టీఆర్ 30(NTR 30) లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంపిక అయిన విషయం తెల్సిందే.అఫిషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది.ఇక ఇటీవలే రామ్ చరణ్ కి జోడిగా కూడా మరో సినిమా లో ఈ అమ్మడు నటించేందుకు కమిట్ అయిందని వార్తలు వస్తున్నాయి.
రామ్ చరణ్ హీరో గా బుచ్చిబాబు దర్శకత్వం లో ఒక సినిమా రూపొందబోతున్న విషయం తెలిసిందే.సమ్మర్ తర్వాత సినిమా చిత్రీకరణ ప్రారంభించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.ఈ సమయం లోనే చిత్ర యూనిట్ సభ్యులు ఆమె ను సంప్రదించారని ఓకే చెప్పారని కూడా తెలుస్తుంది.ఒకేసారి ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్(Ram Charan) సినిమాల్లో నటించబోతున్న జాన్వీ కపూర్ కచ్చితంగా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాబోయే రోజుల్లో వెలుగు వెలగడం ఖాయమని అంటున్నారు.
బాలీవుడ్ లో అవకాశాలు రానప్పుడు, సక్సెస్ రానప్పుడు తెలుగు లో వరుసగా సినిమాలు చేయడం ఉత్తమం అనే నిర్ణయానికి ఈ అమ్మడు వచ్చినట్లుగా తెలుస్తోంది.అందుకే బ్యాక్ టు బ్యాక్ తెలుగు సినిమాలకు కమిట్ అవుతుంది.







