బడాబాబులు ఏం చేసినా క్షణాల్లో న్యూస్ అయిపోతుంది.అయితే సోషల్ మీడియా వచ్చాక అది కాస్త మరింత స్పీడ్ అయిందని చెప్పుకోవాలి.
విషయం ఏమంటే….బిలియనీర్, రిలయన్స్‌చైర్మన్ అయినటువంటి ముఖేష్ అంబానీ, నీతా అంబానీ తమ కవలలు అయినటువంటి ఇషా (Isha)ట్విన్స్ మనవలకు అద్భుతమైన గిఫ్ట్ అందించారు.
కాగా దీనికి సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఆ గిఫ్ట్ ఏమిటనేదేగా మీ ప్రశ్న.
అవును, ఆకర్షణీయమైన ఐదడుగుల అల్ట్రా-లగ్జరీ క్లోసెట్‌ను వారికి బహుకరించడం జరిగింది.

ఇక ఇది ఏ సందర్భంగా చోటుచేసిఉంది అంటే… మనవడు కృష్ణ(Krishna) మనవరాలు అయినటువంటి ఆద్య(Adya) పుట్టిన సందర్భంగా గ్రాండ్‌గా పార్టీ ఇచ్చిన అంబానీ దంపతులు తాజాగా వారికి సదరు గిఫ్ట్ అందించారు.దానిని వారు సోషల్ మీడియాలో ప్రదర్శించగా అది కాస్త వైరల్ అవుతోంది.ఇకపోతే పాపులర్ మహిళా పారిశ్రామిక వేత్త, అంబానీ ఏకైక కుమార్తె అయినటువంటి ఇషా అంబానీ, వ్యాపార దిగ్గజం ఆనంద్ పిరమల్ దంపతులకు 2022 నవంబరులో కవల పిల్లలకు జన్మించిన సంగతి అందరికీ తెలిసిందే.
ఈ కవలల కోసమే లగ్జరీ క్లోసెట్(luxury closet)ను ప్రత్యేకంగా కస్టమైజ్ చేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం ఇక్కడ ప్రత్యేకతని సంతరించుకుంది.

అది నెటిజన్లకు కూడా బాగా నచ్చడంతో దీనికి సంబంధించిన వీడియో ఇపువుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఎల్లో కలర్ రూంలో హాట్-ఎయిర్ బెలూన్‌లతో మేఘాల వాల్‌పేపర్‌తో ఇది బాగా ఆకట్టుకుంటోంది.అలాగే అక్కడ టెడ్డీ బేర్‌లు, ఆకర్షణీయమైన రంగుల రంగుల పువ్వులు, 2 స్పెషల్ బాక్స్‌లతోపాటు, ఒక గ్లోబ్, ఇంకా 2 పాస్‌పోర్ట్‌లు, ఒక చిన్న విమానాన్ని కూడా ఇందులో పొందుపర్చడం విశేషం.
ఇక కస్టమైజ్డ్ క్లోసెట్ డోర్ పైన “అడ్వెంచర్స్ ఆఫ్ ఆద్య అండ్ కృష్ణ” అని రాసి ఉండటం గమనించవచ్చు.







