మహానటి సావిత్రి జీవితం ఎంత తవ్విన తరగని నిది లాంటిది.అందుకే ఎన్నో లక్షల వార్తలు ఆమె గురించి నిత్యం కనిపిస్తూనే ఉంటాయి.
సావిత్రి (Savitri) కన్ను మూసి ఇన్నేళ్లయినా ఆమె గురించి మాట్లాడుకోకుండా ఉండలేక పోతున్నాం అంటే ఆమె గొప్పతనం అలాంటిది.ఇక ఆ తరం నటులలో ఒకరైన గుమ్మడి తన జీవితంలో చుసిన అనేక సంఘటలను పుస్తక రూపం లో తీసుక వచ్చారు.దాని పేరు తీపిగురుతులు. ఇక ఇందులో మహానటి సావిత్రి గురించి కూడా కొన్ని విషయాలను పంచుకున్నారు.
ఆయన సావిత్రి గురించి మాట్లాడుతూ ఆమెకు తమిళం లో తెలుగు కంటే ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేదని, రోజు చాల మంది తమిళులు ఆమె చుట్టూ చేరేవారని తెలిపారు.కొంత మంది నటీనటులైతే సావిత్రి ఎలా నటిస్తుందో చూసి నేర్చుకుందామని వచ్చేవారు.
ఈ క్రమం లోనే పిళ్ళై అనే ఒక డైరెక్టర్ సావిత్రి అంటే తెగ అభిమానం చూపిస్తూ ఆమె చుట్టూ తిరుగుతూ ఉండేవాడట.సావిత్రి ఎక్కడ షూటింగ్ లో ఉంటె పిళ్ళై అక్కడే ఉండేవాడట.

ఇక పిళ్ళై (Pillai) కూడా ఆశ మాషి వ్యక్తి ఏమి కాదని, అతను మంచి సినిమాలు తీసి గొప్ప దర్శకుడిగా పేరు తెచుకున్నాడని గుమ్మడి వివరించారు.తాను షూటింగ్ లో ఉన్న కూడా సాయంకాలం అయ్యింది అంటే షూటింగ్ ముంగించేసుకొని సావిత్రి ఉండే సెట్ కి వచ్చేవాడు.ఈ రకంగా సావిత్రి తో పరిచయం పెంచుకొని ఆమెతో ప్రేమలో పడ్డాడు కానీ అప్పటికే సావిత్రి జెమినీ తో(Gemini Ganeshan) పీకల్లోతు ప్రేమ లో ఉంది.ఆ విషయం తెలియక పిళ్ళై సావిత్రి ని చాలా ప్రేమించాడు.

తమిళ్ లో సావిత్రి కి ప్రేమ ప్రపోజల్ కూడా పెట్టాడు.ఇక పిళ్ళై మరియు గుమ్మడి(Gummadi) మంచి స్నేహితులు కూడా.గుమ్మడి తో సావిత్రి కి కూడా మంచి అనుబంధం ఉండటం తో సావిత్రి కి రాయబారం కూడా పంపించాలి అనుకున్నాడట.సావిత్రి అంటే ఇష్టం అని, ఆమెను పెళ్లి చేసుకుంటాను అని తనతో నువ్వు మాట్లాడి చెప్పు అని చెప్పాడట.
అయితే గుమ్మడి జెమినీ తో ప్రేమ వ్యవహారం గురించి పిళ్ళై కి చెప్పగా, మనసు విరిగిపోయి సినిమాలు మానేసి తన సొంత వూరికి వెళ్ళిపోయాడట.