Tu Jhoothi Main Makkaar : ఆ కారణంతోనే దీపికా పదుకునే ఆ సినిమాకు నో చెప్పిందా?

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో కొంతమంది హీరో, హీరోయిన్లు రిజెక్ట్ చేసిన కథలను ఇతర హీరో హీరోయిన్ల వద్దకు వెళ్లడం, వారు అందుకు ఓకే చెప్పడం,ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ సాధించడం అన్నవి జరుగుతూ ఉంటాయి.ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో ఇలాంటివి ఎన్నో జరిగాయి.

 Tu Jhoothi Main Makkaar : ఆ కారణంతోనే దీపికా ప-TeluguStop.com

కేవలం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా ఇలాంటి ఘటనలు ఇప్పటికే ఎన్నో చోటు చేసుకున్నాయి.అలా అవకాశాలను మిస్ చేసుకున్న విషయాలను ఆయా హీరో హీరోయిన్లు స్వయంగా ఏదైనా ఇంటర్వ్యూలలో చెబుతూ ఉంటారు.

Telugu Bollywood, Luv Ranjan, Shraddha Kapoor-Movie

అటువంటి సమయంలో ఆయా హీరో హీరోయిన్లతో పాటు వారి అభిమానులు కూడా అవును సినిమా చేసి ఉంటే మంచి క్రేజ్ వచ్చి ఉండేది అని అనుకుంటూ ఉంటారు.అలాంటి ఒక మంచి అవకాశాన్ని మిస్ చేసుకుంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే.బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఈ ముద్దుగుమ్మ సుపరిచితమే.దీపికా పదుకొనే మిస్ చేసుకున్న ఆ సినిమా ఏంటి అన్న విషయానికి వస్తే.తూ జూఠీ మే మక్కర్ సినిమా( Tu Jhoothi Main Makkaar) బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న సంగతి విషయం తెలిసిందే.దాంతో ఇటు రణ్ బీర్ కపూర్ తో పాటు అటు శ్రద్ధాకపూర్ ఖాతాలోనూ భారీ హిట్ పడింది.

Telugu Bollywood, Luv Ranjan, Shraddha Kapoor-Movie

అయితే ఈ హిట్ ను దీపికా పదుకోనే (Deepika padukone)కావాలని మిస్ చేసుకుందని తెలుస్తోంది.అయితే మొదట రణ్ బీర్ కు జోడీగా శ్రద్ధా బదులు దీపికనే అనుకున్నారు.అందుకు దీపికా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.కానీ, ఈ వార్త బయటకు వస్తూనే దీపిక అభిమానులు గగ్గోలు పెట్టేశారు.మీటూ వివాదంలో తూ జూఠీ మే మక్కర్ దర్శకుడు లవ్‌ రంజన్‌ పేరు(Luv Ranjan) ప్రముఖంగా వినబడింది.అలాంటి అతడి సినిమాలో నటించవద్దంటూ దీపిక భిమానులు నెత్తీ నోరూ కొట్టుకున్నారు.

మరి వారి అభిప్రాయాన్ని గౌరవించాలనుకుందో ఏమోదీపిక ఆ సినిమాకు నో చెప్పేసింది.అలా శ్రద్ధా కపూర్ వచ్చి చేరింది.

ఏమైనా ఓ మంచి స్టాండ్ దీసుకున్నందుకు అభిమానులు తెగ మురిసిపోతన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube