సమంత. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
హీరోయిన్ గా ఎంత మంచి పేరు సంపాదించుకుందో వ్యక్తిగతంగా అంత హాట్ టాపిక్ గా నిలిచింది.ఏం మాయ చేసావే సినిమాతో తొలిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.
తొలిచూపులతోనే తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది.
ఇక ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకొని స్టార్ హోదాకు చేరుకుంది.
మధ్యలో కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా కూడా వెనుకడుగు వేయకుండా ముందుకు కొనసాగింది.సొంతంగా వ్యాపారాలు కూడా మొదలు పెట్టింది.ఇక గతంలో ఈమె నటుడు సిద్ధార్థ్ తో ప్రేమాయణం చేయగా కొన్ని కారణాల వల్ల అతనికి బ్రేకప్ చెప్పేసింది.

ఆ తర్వాత తనతో కలిసి నటించిన నాగచైతన్యను ప్రేమించి కుటుంబ సమక్షంలోఅంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది.పెళ్లి తర్వాత కూడా తన భర్త నాగచైతన్యతో పలు సినిమాలలో చేసింది.ఇక అడ్వటైజ్మెంట్లలో కూడా సమంత (Samantha) యాక్టివ్ గా ఉంటుంది.
కొన్ని బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా చేసింది.ఇక పెళ్లి తర్వాత సమంతకు మంచి గౌరవం ఏర్పడింది.
పెళ్లి తర్వాత ఆమెకు మంచి మంచి సినిమాలు కూడా వచ్చాయి.నాగచైతన్య తో (Nagachaitanya) కూడా బాగా ఎంజాయ్ చేసింది.అయితే ఏం జరిగిందో తెలియదు కానీ వారిద్దరి మధ్య కొన్ని మనస్పర్దాల కారణాలవల్ల విడాకులు అయ్యాయి.ఇక ఈ విషయం ఏడాది కిందట సమంత, చైతన్య ఇద్దరు సోషల్ మీడియా వేదికగా తెలిపి తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు పెద్ద షాక్ ఇచ్చారు.

పెళ్లి తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళది అన్నట్లుగా బతుకుతున్నారు.ఇక నాగచైతన్య మెల్లిమెల్లిగా కెరీర్ ను ముందుకు కొనసాగిస్తున్నాడు.సమంత మాత్రం ఓ రేంజ్ స్పీడ్ లో దూసుకుపోతుంది.వచ్చిన సినిమాలను, వచ్చిన పాత్రలను ఏమాత్రం వదలకుండా చేసేస్తుంది.ఇక సమంత ఖాళీ సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో సమయాన్ని గడుపుతుంది.
తను దిగిన ఫోటోలను, సినిమా అప్డేట్లను, ఇంట్రెస్టింగ్ విషయాలను, కొటేషన్స్ ను బాగా పంచుకుంటుంది.
అంతేకాకుండా తను బాగా వర్క్ అవుట్ లు చేస్తున్న వీడియోలను కూడా షేర్ చేస్తుంది.ఇక ఇదంతా పక్కనే పెడితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక స్టోరీ పంచుకుంది.
అందులో అమ్మాయి నడుము, థైస్ కు మధ్య ఉన్న భాగాన్ని నగ్నంగా పంచుకుంది.

అయితే ఆ ఫోటోలో నడుము కింద ఉన్న చారలను ప్రత్యేకంగా చూపిస్తూ ఒక విషయాన్ని పంచుకుంది.ఈ అసంపూర్ణమైన ప్రపంచంలో ఆమె పర్ఫెక్ట్ గా లేకున్నా కూడా పర్ఫెక్ట్ గా ఉంది అని చెప్పుకొచ్చింది.అంటే ఆమె అలా ఉన్నా కూడా పర్ఫెక్ట్ గా ఉంది అని అర్థం.ప్రస్తుతం ఆ స్టోరీ బాగా వైరల్ అవుతుంది.ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే శాకుంతలం సినిమాతో(Shaakuntalam) త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.అంతేకాకుండా ఖుషి (Khusi) అనే సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.







