తెలుగు బుల్లితెర నటుడు నిరుపమ్ పరిటాల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగు బుల్లితెర పై ఎన్నో సీరియల్స్ లో నటించి నటుడిగా మంచి గుర్తింపును ఏర్పరుచుకున్నాడు నిరుపమ్.
అయితే చాలామంది నిరుపమ్ అనగానే గుర్తు పెట్టకపోవచ్చు కానీ డాక్టర్ బాబు అంటే చాలు ఇట్టే గుర్తుపట్టేస్తారు.బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ లో నటించినప్పటికీ కార్తీకదీపం సీరియల్ ద్వారా విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు నిరుపమ్.
కార్తీకదీపం సీరియల్ డాక్టర్ బాబు క్యారెక్టర్ లో నటించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరింత చేరువయ్యాడు.ఇకపోతే నిరుపమ్ బుల్లితెర నటి మంజులను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

మంజుల కూడా పెళ్లికీ ముందు కూడా పలు సీరియల్స్ లో నటించి నటిగా మంచి గుర్తింపు ఏర్పరచుకుంది.పెళ్లి అయిన తర్వాత కూడా మంజుల ఇప్పటికి సీరియల్స్ లో నటిస్తూనే వుంది.నిరుపమ్ ఒకవైపు సీరియల్స్ లో నటుడిగా నటిస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు.ఇటీవలే స్టార్ మాలో ప్రసారమైన పల్లకిలో పెళ్లికూతురు అనే సీరియల్ కి నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సీరియల్ నిరుపమ్ భార్య మంజుల కూడా నటిస్తోంది.ఇది ఇలా ఉంటే నిరుపమ్, మంజుల ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటారు.

సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ని మొదలుపెట్టిన ఈ జంట వారికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని ఆ యూట్యూబ్ ఛానల్ లో విడుదల చేస్తూనే ఉంటారు.ఈ నేపథ్యంలోనే తాజాగా మంజుల తన యూట్యూబ్ ఛానల్ లో ఒక వీడియోని షేర్ చేసింది.మా కొత్త ఇల్లు రెడీ అవుతుందోచ్ అనే క్యాప్షన్ కూడా జోడించారు.ఆ వీడియోలో మంజుల తన కొత్త ఇంటిని చూపిస్తూ అందులో డిజైన్స్ గురించి కన్స్ట్రక్షన్ గురించి వివరించింది.
ఆ ఇంటిని నిరుపమ్ నాన్న బుక్ చేశారని, గతంలో ప్రభుత్వం సినీ కార్మికుల కోసం మంజూరు చేసిన హౌసింగ్ సొసైటీ ద్వారా ఈ ఇల్లు వచ్చిందని కానీ నిరుపమ్ నాన్న లేకపోవడంతో ఆ ఇల్లు మాకు వచ్చింది అని తెలిపింది మంజుల.అయితే ఆ ఇల్లును బుక్ చేసి దాదాపు 15 18 సంవత్సరాలు కావొస్తోంది.
ఇక ముందుగా ఆ ఇంటిని 3 BHK అనుకున్నారు, కానీ తర్వాత దానిని డూప్లెక్స్ ఫ్లాట్ గా తీర్చిదిద్దుతున్నారని మంజుల చెప్పుకొచ్చింది.ఇంటీరియల్ డిజైనింగ్ పనుల కారణంగానే ఆస్యం అవుతూవస్తోందని, దాదాపు 18 సంవత్సరాల తర్వాత ఇల్లు పూర్తి అవుతుండటంతో సంతోషంగా ఉందని అని తెలిపింది మంజుల.







