నటి పవిత్ర లోకేష్(Naresh), నటుడు నరేష్ ల గురించి మనందరికీ తెలిసిందే.ప్రస్తుతం వీరిద్దరి పేర్లు సోషల్ మీడియాలో మారుమోగుతున్నాయి.
గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్న ఈ జంట ఇటీవల ఏడాది మొదట్లో త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాం అని ప్రకటించిన విషయం తెలిసిందే.తాజాగా నరేష్ తన పెళ్లి వీడియో షేర్ చేశాడు అంటూ వార్తలు జోరుగా వినిపించిన సంగతి తెలిసిందే.
అయితే ఎటువంటి హంగామా లేకుండా పెళ్లి తర్వాత పెళ్లి విషయాన్ని ప్రకటించడంతో చాలామంది అవన్నీ కొట్టి రూమర్సే అని కొట్టి పడేశారు.

తాజాగా నిన్న అనగా శుక్రవారం ఉదయం నరేష్ తన ట్విట్టర్ వేధికగా(Social media) పోస్ట్ చేయడంతో మొత్తానికి ఇన్నాళ్లకు వివాహబంధంతో ఒక్కటయ్యారని శుభాకాంక్షలు తెలిపారు అభిమానులు.కానీ మరోవైపు ఇది నిజమైన పెళ్లా లేకపోతే ఏదైనా షూటింగ్ కోసమా అన్న విషయం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.తాజాగా ఈ విషయంపై నటుడు నరేష్ స్పందించారు.
ఇకపోతే తాజాగా నరేష్ నటించిన వెబ్ సిరీస్ ఇంటింటి రామాయణం(Intinti Ramayanam).ఈ వెబ్ సిరీస్ త్వరలోనే విడుదల కానుంది.
ఇందుకు సంబంధించిన ప్రెస్ మీట్ తాజాగా హైదరాబాదులో జరగడంతో ఆ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు నరేష్.ఈ సందర్భంగా మీడియా నరేష్ పెళ్లి ప్రస్తావన తీసుకు వచ్చింది.

మనం ఇక్కడికి వచ్చింది సినిమా విషయం మాట్లాడటానికి అంటూ పెళ్లి విషయాన్ని దాటవేశారు.ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మీ పెళ్లి విషయమే హాట్ టాపిక్ గా ఉందని.పెళ్లి భోజనం ఎప్పుడు పెడతారని మరోసారి ప్రశ్నించగా.ఇక ఈ విషయం డైవర్ట్ చేయదల్చుకోలేదు.నాకు సంబంధించిన ప్రతి విషయాన్ని మీడియాకు తప్పకుండా తెలియపరుస్తాను ఈ విషయం మీకు కూడా తెలుసు.త్వరలో దానికి సంబంధించిన విషయం కూడా ప్రెస్ మీట్ పెట్టి అందరికీ చెబుతాను.
అప్పటి వరకు కాస్త ఓపిక పట్టండి అని తెలిపారు.అలాగే సెలబ్రెటీలకు రీల్ లైఫ్, రియల్ లైఫ్ ఒకటి ఉంటుంది.
నా లైఫ్ ని నేను జీవిస్తున్నాను.నాకు ప్రైవసీ కావాలి అంటూ ప్రస్తుతానికి తన పెళ్లి ప్రస్తావనకు ఫులిస్టాప్ పెట్టారు నరేష్.
కానీ సోషల్ మీడియాలో తాను షేర్ చేసిన ఆ వీడియో పై మాత్రం ఎటువంటి వివరణ ఇవ్వలేదు నరేష్.







