దుండగుల దాడిలో దారుణహత్యకు గురైన భారత సంతతి యువకుడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడానికి అతని బంధువులు నిరాకరించారు.హోలా మొహల్లా పండుగ సందర్భంగా జరిగిన ఘర్షణలో పర్దీప్ సింగ్ అలియాస్ ప్రిన్స్ కత్తిపోట్లకు గురై ప్రాణాలు కోల్పోయాడు.
ఇతని స్వస్థలం గురుదాస్‌పూర్ జిల్లా.అయితే పర్దీప్ సింగ్ కొద్దిరోజుల క్రితం కెనడా నుంచి వచ్చి ఆనంద్‌పూర్ సాహిబ్‌లో వుంటున్నాడు.
అయితే ఈ నేరానికి పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేసే వరకు తాము అంత్యక్రియలు నిర్వహించేది లేదని మృతుడి బంధువులు స్పష్టం చేశారు.ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పంజాబ్‌లోని నూర్పూర్ బేడీకి చెందిన మరో యువకుడు ప్రస్తుతం చండీగఢ్‌లోని పీజీఐలో చికిత్స పొందుతున్నాడు.

ఈ ఘటనపై ఆనంద్‌పూర్ సాహిబ్ ఎస్ఎస్‌పీ మాట్లాడుతూ.మార్చి 5న సాయంత్రం పర్దీప్.నూర్‌పూర్ బేడీకి చెందిన సత్బీర్ సింగ్‌తో గొడవపడ్డాడు.ఇద్దరి చేతిలో మారణాయుధాలు వుండటంతో గొడవ తారాస్థాయికి చేరింది.ఈ ఘర్షణలో సత్బీర్ ఎడమ చేయి కట్ అయ్యింది, దీంతో అతను పర్దీప్‌ను ఛాతీ కింద పొడిచాడు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో స్థానికంగా కలకలం రేపింది.
అందులో కొందరు యువకులు పర్దీప్‌పై దాడి చేయటం కనిపించింది.ఘర్షణ తర్వాత అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయినట్లు ఎస్ఎస్‌పీ చెప్పారు.

ఈ హత్యకు కారణమైన ఇతర నిందితులను పోలీసులు ఇంకా గుర్తించనప్పటికీ, ఘర్షణకు దారితీసిన కారణాలపై అధికారులు నోరు మెదపలేదు.అయితే ఆనందపూర్ సాహిబ్ ప్రవేశ ద్వారం దగ్గర జరిగిన ఘర్షణలో పలువురు వ్యక్తులు పాల్గొన్నట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో తేలిందని ఎస్ఎస్‌పీ తెలిపారు.మరోవైపు పర్దీప్ తండ్రి గుర్బక్ష్ సింగ్, మావయ్య గుర్దియల్ సింగ్ మాట్లాడుతూ.సిద్ధూ మూసేవాలా హత్య జరిగి తొమ్మిది నెలలు కావొస్తున్నా ఇప్పటికీ న్యాయం జరగలేదన్నారు.అయితే తమ కుమారుడి విషయంలో మాత్రం అలా జరగనిచ్చేది లేదని వారు తేల్చిచెబుతున్నారు.