నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నటించిన తాజా చిత్రం దసరా. ఈ సినిమా ఈనెల 30వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.
ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా హీరో నాని ముంబైలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన భారతీయ సినిమాల గొప్పతనం గురించి ఈ సినిమాల ఖ్యాతిని అమాంతం పెంచేసిన డైరెక్టర్ రాజమౌళి గురించి ఎంతో గొప్పగా చెబుతూ రాజమౌళి పై ప్రశంసల వర్షం కురిపించారు.

ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ భారతీయ సినిమా అంటే అందరూ దక్షిణాది వైపు చూసే విధంగా రాజమౌళి చేశారంటూ ఆయన పై ప్రశంసల వర్షం కురిపించారు.ఇక ఈయన సినిమాలను కనుక చూస్తే ప్రతి ఒక్క సన్నివేశాన్ని కూడా ఎంతో క్షుణ్ణంగా పరిశీలించి ఒకటికి రెండుసార్లు ఆ సన్నివేశం గురించి ఆలోచిస్తారు.ఆయన ఒక దార్శనికుడు.ఎవరికి రానటువంటి ఆలోచనలు రాజమౌళి గారికి వస్తాయని ఎవరు చేయలేనటువంటి పనులను ఆయన చేసి చూపిస్తారని తెలిపారు.ఆయన ఎలాంటి అసాధ్యమైన పనులను కూడా సుసాధ్యం చేసి చూపిస్తారని ఈ సందర్భంగా నాని తెలిపారు.

ఇక ఆయన దర్శకత్వంలో వచ్చిన RRR సినిమాలోని నాటు నాటు పాట తప్పనిసరిగా ఆస్కార్ అవార్డు గెలుచుకుంటుందని ఈయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ తెలుగు మాస్ పాట ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిందని తప్పకుండా ఈ పాటకు ఆస్కార్ అవార్డు వస్తుందని నాని వెల్లడించారు.భారతీయ సినిమాలు ఎంతో ప్రత్యేకమైనవని నిరూపించాయి.
అయితే నాటు నాటు పాట కేవలం ఆరంభం మాత్రమేనని ముందు ముందు ఇలాంటివి మరెన్నో ప్రేక్షకుల ముందుకు వస్తాయి అంటూ ఈ సందర్భంగా నాని రాజమౌళి గురించి, నాటు నాటు పాట గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







