యాంకర్ శ్రీముఖి.ఈ మధ్యకాలంలో తెలుగు బుల్లితెరపై ఎక్కువగా మారుమోగుతున్న పేరు.
ఈ మధ్యకాలంలో ఏ ఈవెంట్లో చూసినా ఏ షో చూసినా కూడా ఎక్కువగా శ్రీముఖి నే కనిపిస్తోంది.ఒకవైపు వరుసగా షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూనే మరొకవైపు సినిమా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.
ఇక శ్రీముఖి అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆమె ఎనర్జీ.స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే ఎనర్జీతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ కడుపుబ్బా నవ్విస్తూ ఉంటుంది.
ఇది ఇలా ఉంటే శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తున్న షోలలో మిస్టర్ అనే మిస్సెస్ కార్యక్రమం కూడా ఒకటి.ఈ షో గ్రాండ్ ఫినాలే కి చేరుకుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా అందుకు సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు షో నిర్వాహకులు.కాగా గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి డైరెక్టర్ అనిల్ రావిపూడి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఇప్పటికే మిస్టర్ అంద మిసెస్ షో కి హీరో శివ బాలాజీ హీరోయిన్ నేహా జడ్జిలుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.ప్రోమో మొత్తం అంతా కూడా ఫన్నీ టాస్కులు ఆటలతో బాగా సాగింది.
ఈ షోలో ఇటీవలే ఒక్కటైన జబర్దస్త్ రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత జంట కూడా పాల్గొన్నారు.ఇక టాస్క్ ఆడే క్రమంలో రాకండి రాకేష్ కి శ్రీముఖి నవ్వుతూనే ఒక మాస్ వార్నింగ్ ఇచ్చింది.
ఒక టాస్క్ లో భాగంగా దంపతులలో ఒకరు కళ్ళకు గంతలు కట్టుకోగా మరొకరు బాలు వేస్తే స్టూల్ మీద నిల్చోని బాస్కెట్ బాల్ పడేలా చేసి గోల్ చేయాలి.

మొదట రాకేష్ బాల్స్ వేయగా సుజాత పట్టుకునే ప్రయత్నం చేసింది.రెండుసార్లు స్టెప్పు పడిన బంతిని గోల్ చేసే ప్రయత్నం చేశాడు రాకేష్.అప్పుడు శ్రీముఖి దగ్గరికి వెళ్లి అదేంటి రెండు సార్లు స్టెప్స్ పడితే గోల్ లెక్కలేకి లేదా అని అడగగా దొబ్బింది అమ్మ 2 స్టెప్స్ లేవని ముందే చెప్పినా కదరా లఫూట్ అని అంటుంది.
అప్పుడు రాకేష్ శ్రీముఖి మీద చేయి వేయడంతో చేయి లేస్తుంది ఏందిరా మళ్లీ కాపురానికి పనికిరాకుండా పోతావు అంటూ వార్నింగ్ ఇవ్వడంతో అక్కడున్న వారందరూ నవ్వుకున్నారు.







