శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవిల్లిలో అద్భుతం ఆవిష్కృతమైంది.ఉషా పద్మిణీ ఛాయాదేవి సమేత ఆదిత్యుని పాదాలను లేలేత సూర్య కిరణాలు తాకాయి.
ఈ అరుదైన దృశ్యాన్ని భక్తులు దర్శించుకున్నారు.కాగా ఏడాదికి రెండు సార్లు స్వామివారికి కిరణ స్పర్శ జరగడం ఆనవాయితీగా వస్తోన్న విషయం తెలిసిందే.
కాగా ప్రతి ఏటా మార్చి 9,10 తేదీలతో పాటు అక్టోబర్ నెలలోని 1, 2 తేదీలలో సూర్యనారాయణ స్వామివారి పాదాలను కిరణాలు తాకుతాయి.







