ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ అర్హత లేదంటున్న తమ్మారెడ్డి .. ఇవే రీజన్లు అంటూ?

టాలీవుడ్ స్టార్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.ఇప్పటికీ ఈ సినిమా మేనియా ఇంకా తగ్గలేదు.ఇది ఇలా ఉంటే ఈ సినిమా రికార్డు స్థాయిలో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్టించిన విషయం తెలిసిందే.

 Tammareddy Bharadwaj Shocking Comments Rrr Movie Details, Tammareddy Bharadwaaj,-TeluguStop.com

ఇది ఇలా ఉంటే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఈ సినిమా పేరు మారుమోగిపోతుంది.ఆర్ఆర్ఆర్ సినిమా అవార్డుల మీద అవార్డులు అందుకుంటూ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది.

దానికి తోడు ఈ సినిమా ఆస్కార్ కి నామినేట్ అయిన విషయం తెలిసిందే.

దీంతో దర్శకుడు రాజమౌళి అలాగే హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ప్రస్తుతం చిత్ర బృందం అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే గత కొద్దిరోజులుగా ఈ సినిమా ఆస్కార్ కు నామినేట్ అయింది అన్న సంతోషంలో అభిమానులు ఆ వార్తను సోషల్ మీడియాలో వైరల్ చేస్తుండగా తాజాగా ఇదే విషయంపై స్పందించారు తమ్మారెడ్డి భరద్వాజ.

ఈ సందర్భంగా వీడియోలో తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.కొద్దిరోజులుగా ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ కి వెళ్తుంది అని చాలా మంది అంటున్నారు.

ఇప్పటికే నేను ఇద్దరు ముగ్గురికి చెప్పాను.ఈ సినిమా ఆస్కార్ కి వెళ్ళదు.

ఆస్కార్ కి లోకల్ వాళ్లకి ఫారిన్ వాళ్ళకి ఫారిన్ కంట్రీస్ వాళ్ళకి ఎక్కువగా వెళ్తుంటాయి.

Telugu Rajamouli, Ntr, Natu Natu, Ram Charan, Rrr Oscar Award, Sensational, Tamm

మన దేశం నుంచి వెళ్లేవి ఇండిపెండెంట్ గా కొన్ని ఉంటాయి.అలా అందుకోసం ఎన్నో కండిషన్స్ అన్ని ఉంటాయి అని చెక్ చేసిన తర్వాత పంపిస్తారు అని తెలిపారు తమ్మారెడ్డి భరద్వాజ.ఆస్కార్ కి కానీ నేషనల్ అవార్డు కానీ వెళ్లడానికి కొన్ని పద్ధతులు, గైడ్ లెన్స్ ఉన్నాయి.

సమాజానికి పనికొచ్చే సినిమాలనో టెక్నికల్ గా అద్భుతంగా ఉన్న సినిమాలు ఆస్కారికి వెళ్తాయి కానీ డబ్బులు ఎక్కువ చిన్న సినిమాలు కాదు అని తెలిపారు.ఆర్ఆర్ఆర్ కి డబ్బులు ఎక్కువగా వచ్చాయి కాబట్టి ఎవరో నలుగురు అనగానే ఆ సినిమా ఆస్కార్ కి వెళ్లాల్సిన అవసరం లేదు.

ఆర్ఆర్ఆర్ కమర్షియల్ సినిమా. భారీగానే డబ్బులు సాధించింది.

అయితే సినిమా ఆస్కార్ కి వెళ్లే అర్హత ఉందా లేదా అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి అని తెలిపారు.

Telugu Rajamouli, Ntr, Natu Natu, Ram Charan, Rrr Oscar Award, Sensational, Tamm

మనకు దేశానికి గౌరవం తెచ్చిన సినిమా వెళ్తుంది కానీ డబ్బులు తెచ్చిన సినిమా కాదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.ప్రతి దేశం నుంచి రెండు సినిమాలు మాత్రమే తీసుకుంటారు.మనదేశంలో ఎన్నో రకాల భాషలు ఉన్నాయి అన్ని భాషల్లో సినిమాలను నుంచి ఫిల్టర్ చేసి పలుకు బాగా అనిపించిన సినిమాకు మాత్రమే ఆస్కార్ అవార్డుని ప్రజెంట్ చేస్తారు అని తెలిపారు తమ్మారెడ్డి భరద్వాజ.

అక్కడ మేధావులే ఉంటారు పనికిరాని వాళ్ళు ఉండరు అని తెలిపారు.దేశం గురించి మాట్లాడుకునే సినిమా కానీ దేశానికి గౌరవం తెచ్చే సినిమా కానీ ఆస్కార్ కి నామినేట్ అవుతుంది ఇలాంటి సినిమాలు కాదు అని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube