తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు దగ్గుబాటి వారసుడు రానా.ఈయన లీడర్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా మారిపోయారు.
ఇక బాహుబలి సినిమాతో రానా పాన్ ఇండియా హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇలా బాహుబలి సినిమా తర్వాత రానా సినిమాలను కాస్త తగ్గించారనే చెప్పాలి.
ఇలా సినిమాలకు గ్యాప్ ఇస్తూ విభిన్నమైన కథ చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

ఇకపోతే తాజాగా ఈయన సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లోకి కూడా అడుగుపెట్టినట్టు తెలుస్తుంది.ఈ క్రమంలోనే తన బాబాయ్ వెంకటేష్ తో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.ఈ వెబ్ సిరీస్ మార్చి 10వ తేదీ నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది.
ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రానా తన కెరీర్ గురించి పలు విషయాలను తెలియజేశారు.

ఈ క్రమంలోనే ఈమధ్య కాలంలో రానా సినిమాలకు బాగా గ్యాప్ ఇస్తున్న విషయం మనకు తెలిసిందే.ఈ విషయం గురించి ఆయనను ప్రశ్నించగా ఆసక్తికరమైన సమాధానం చెప్పారు.కెరియర్ మొదట్లో నాకంటూ ఓ గుర్తింపు రావడం కోసం హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటించాను కానీ ఇప్పుడు నాకు అవసరం లేదు.ఇండస్ట్రీలో నాకంటూ ఓ గుర్తింపు వచ్చింది అందుకే విభిన్నమైన కథ చిత్రాల ద్వారా మాత్రమే ప్రేక్షకుల ముందుకు రావాలని నిర్ణయించుకున్నాను.
చేస్తే అలాంటి విభిన్న కథలనే చేయాలని లేకపోతే సినిమాలే చేయకూడదని నిర్ణయించుకున్న తర్వాతే సినిమాలకు కాస్త గ్యాప్ వస్తుందని ఈయన వెల్లడించారు.ఇలా సినిమాల గ్యాప్ విషయం గురించి రానా చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







