తండ్రిని కడతేర్చిన కసాయి కొడుకు.. సవతి తల్లిపై అఘాయిత్యం..!

సమాజంలో రోజురోజుకు మానవ సంబంధాలకు విలువ లేకుండా పోతోంది.కుటుంబ సభ్యుల పట్ల కిరాతకంగా ప్రవర్తించి, ఊహించని దారుణాలు చేస్తూ జీవితాలను నాశనం చేసుకుంటూ, కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు.

 Odisha Man Killed Father And Harassed Stepmother Details, Odisha Man, Killed Fat-TeluguStop.com

ఇటీవలే కాలంలో తల్లిదండ్రుల పట్ల పిల్లలు కిరాతకంగా ప్రవర్తించడం, పిల్లల పట్ల కూడా తల్లిదండ్రులు కిరాతకంగా ప్రవర్తించి పలు దారుణాలు చేయడం వింటూనే ఉన్నాం.ఇలాంటి కోవకు చెందిన ఒక సంఘటన ఒడిశాలో చోటుచేసుకుంది.

ఓ 20 ఏళ్ల యువకుడు తండ్రిని కడతేర్చి సవతి తల్లి పై అత్యాచారం చేసి, అక్కడినుండి పారిపోయాడు.పోలీసులకు సమాచారం అందడంతో , సంఘటన స్థలానికి చేరుకొని సవతి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 20 ఏళ్ల యువకుడు మరియు తండ్రి కలిసి జీవించకుండా సవతి తల్లి అడ్డుగా ఉంది.అందువల్ల నిందితుడు పక్క గ్రామంలో నివాసం ఉంటున్నాడు.ఇక ఆదివారం నిందితుడు తన తండ్రి ఇంటికి రావడంతో, ఆ యువకుడికి, సవతి తల్లికి మధ్య ఘర్షణ మొదలైంది.ఇంతలో తన 65 ఏళ్ల తండ్రి కూడా యువకుడునే నిందించాడు.

కాసేపటికి గొడవ పెరగడంతో కోపంలో ఓ పదునైన ఆయుధంతో తండ్రిని బలంగా కొట్టడంతో రక్తపు మడుగులోకి జారి తండ్రి మృతి చెందాడు.అనంతరం సవతి తల్లిపై అత్యాచారం చేసి అక్కడి నుండి పారిపోయాడు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పటల్ కు తరలించారు.సవతి తల్లి, తండ్రితో కలిసి జీవించేందుకు అనుమతి ఇవ్వకపోవడం వల్లనే ఆ యువకుడు హత్య చేసి, అత్యాచారానికి పాల్పడినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.సోమవారం నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.ఈ దారుణాలు చేయడానికి వెనుక ఉన్న కారణాలు ఏమిటో తెలుసుకొని, కారణం ఏదైనా చేసిన తప్పుకు శిక్ష తప్పదని పోలీస్ అధికారులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube