ఆ అవమానంతో గదిలో కూర్చుని ఒంటరిగా ఏడ్చేవాడిని... ధనుష్ కామెంట్స్ వైరల్!

సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రెటీల విషయంలో నేటిజన్స్ వివిధ రకాల అభిప్రాయాలను కలిగి ఉంటారు.ఈ క్రమంలోనే నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి వారి గురించి పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తూ భారీగా ట్రోల్ చేస్తూ ఉంటారు.

 I Used To Sit In The Room And Cry Alone With That Shame Dhanush Comments Are Vir-TeluguStop.com

ఇలా ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా కెరియర్ మొదట్లో ఎన్నో రకాల ట్రోలింగ్స్ ఎదుర్కొని ఇండస్ట్రీలో నిలదొక్కుకోగా మరికొందరు మాత్రం ఈ అవమానాలను భరించలేక ఇండస్ట్రీకి దూరమైనటువంటి వారు కూడా ఉన్నారు.ఈ క్రమంలోనే సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సెలబ్రిటీలకు సైతం ఈ విధమైనటువంటి ట్రోల్స్ తప్ప లేదని చెప్పాలి.

కోలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు ధనుష్ గురించి మనకు తెలిసింది.ఈయనకు సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా ఎంతో మంచి ఆదరణ ఉంది.ఇలా హీరోగా ఇండస్ట్రీలో ఎంతో సక్సెస్ సాధించినటువంటి ధనుష్ తాజాగా సార్ మూవీ ద్వారా పూర్తిస్థాయి తెలుగు చిత్రంలో నటించారు.ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి ఈ హీరో కెరియర్ మొదట్లో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారని చెప్పాలి.

గతంలో తానే ఎదుర్కొన్నటువంటి అవమానాలు గురించి గుర్తు చేసుకున్నటువంటి ఈయన తాజాగా మరోసారి కెరియర్ మొదట్లో తను ఎదుర్కొన్నటువంటి అవమానాలు బాడీ షేమింగ్ ట్రోల్స్ గురించి మాట్లాడారు.తను చిన్న వయసులో ఉన్నప్పుడు కాస్త బక్క పలుచగా నల్లగా ఉండటం వల్ల చాలామంది తన గురించి మాట్లాడుతూ తనని బాడీ షేమింగ్ ట్రోల్ చేసేవారని అయితే ఆ అవమానాలను తట్టుకోలేక ఎన్నోసార్లు గదిలో ఒంటరిగా కూర్చుని ఏడ్చానని తెలిపారు.అయితే నన్ను చూసి వీడు హీరో ఏంటి ఒక ఆటో డ్రైవర్ల ఉన్నారని కామెంట్లు చేసేవారు.

ఆ మాటలు విని బాధపడిన నేను ఒక ఆటో డ్రైవర్ హీరో ఎందుకు కాకూడదన్న ఆత్మవిశ్వాసాన్ని నాలో నింపుకొని నేడు ఈ స్థాయిలో ఉన్నానని ఈయన వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube