కొద్ది రోజుల క్రితం పాలస్తిన వాళ్లు ఇజ్రాయిల్ దేశానికి చెందిన పౌరులను దారుణంగా చంపడం జరిగింది.రాజకీయంగా ఇజ్రాయిల్ లో అస్థిరత్వం ఏర్పడ్డాక.
పాలస్తీనియన్లు వరుస పెట్టి దాడులు చేయడం జరిగింది.ఒక్క ఫిబ్రవరి నెలలోనే ఇజ్రాయిల్ పౌరులను నాలుగు ప్రాంతాలలో లక్ష్యంగా చేసుకుని చేసిన దాడులలో పదిమందికి పైగా మరణించినట్లు ఇజ్రాయిల్ మీడియా తెలియజేస్తూ ఉంది.
బెంజమిన్ నెతన్యహు అధికారం చేపట్టకు ముందు నుండి … ఇజ్రాయిల్ పౌరులను లక్ష్యంగా చేసుకుని పాలస్తీనా భీకరమైన దాడులు చేయడం జరిగింది.

పరిస్థితి ఇలా ఉంటే మంగళవారం ఇజ్రాయిల్ ఆకస్మికంగా ఒక్కసారిగా పాలస్తీనా పై దాడులు జరిపింది.ఈ దాడులలో ఆరుగురు మృతి చెందారు.జెనిన్ నగరంపై ఇజ్రాయిల్ సైన్యం జరిపిన ఆకస్మిక దాడులలో ఆరుగురు పాలస్తీనా ప్రాంతానికి చెందిన పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
ఇదే సమయంలో ఇజ్రాయిల్ సైన్యం చేసిన దాడులకు స్థానిక మిలిటెంట్లు సైతం ప్రతిఘటించడం జరిగింది.ఇజ్రాయిల్ చేసిన దాడులను పాలస్తీనా ప్రభుత్వం ఖండించింది.గత నెల తమ దేశానికి చెందిన పౌరులను విచక్షణ రహితంగా పాలస్తీనా దేశానికి చెందిన వాళ్లు చంపడంతోనే ఇజ్రాయిల్ ప్రతీకారంగా ఈ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది.







