ఇండియా మార్కెట్లో ఏసర్ స్విఫ్ట్ గో 14 సిరీస్ ను తైవాన్ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ ఏసర్ లాంచ్ చేసింది.అయితే 14, 16 అంగుళాల వేరియంట్లతో పాటు తేలికైన డిజైన్, మెరుగైన పనితీరుతో మార్కెట్లోకి అడుగుపెట్టాయి.ఈ ల్యాప్ టాప్ స్పెసిఫికేషన్ వివరాలకు చూస్తే 2.8k రిజల్యూషన్, 14 అంగుళాల OLED డిస్ప్లే, ఏసర్ ఎక్స కలర్, D 65 డిస్ప్లే కలర్స్, AMD రైజన్ 7000 సిరీస్ CPU తో, 2TB వరకు PCIe Gen 4 SSD నిల్వ, 16GB వరకు LPDDR 5 కలిగి ఉంది.
ఇంకా ఈ ల్యాప్ టాప్ లో wifi 6E, USB టైప్ -C, USB టైప్ -A , HDMI 2.1 లాంటి కనెక్టివిటీ ఫీచర్లకు సపోర్ట్ ఇస్తుంది.ఇక 1.25 కిలోల బరువు, 15.9 మిల్లీమీటర్ల మందం కలిగిన ఈ ల్యాప్ టాప్ కేవలం 30 నిమిషాల ఛార్జింగ్ తో నాలుగు గంటలు నిరంతరం పనిచేస్తుంది.ఇందులో క్విక్ బ్యాటరీ చార్జ్ టెక్నాలజీ ఉండడం ద్వారా త్వరగా చార్జింగ్ అవుతుంది.

ఇందులో ఉండే ట్విన్ ఎయిర్ డ్యూయల్ ఫ్యాన్ సిస్టం, డ్యూయల్ డి 6 కాపర్ హిట్ పైపుల వల్ల ఉష్ణోగ్రత లో మార్పులు జరిగినప్పుడు వేడిని పంపే ఎయిర్ ఇంటెల్ కీబోర్డ్ ఫీచర్లు కూడా ఉన్నాయి.అంతేకాకుండా ఏసర్ ప్యూరి ఫైడ్ వాయిస్ టెక్నాలజీ ఉండడంతో స్పష్టమైన చిత్రాలు, ఆడియో పొందవచ్చు.దీనితో మంచి క్వాలిటీ ఫోటోలను తీయవచ్చు.అంతేకాకుండా టి ఎన్ ఆర్ సొల్యూషన్స్ ను కూడా కలిగి ఉంది.భారత మార్కెట్లో రూ.62,990 రూపాయల లో అందుబాటులో ఉంది.అమెజాన్, ఏసర్ E – స్టోర్, క్రోమా లలో వినియోగదారులకు అందుబాటులో ఉంది.







