నందమూరి బాలకృష్ణ అఖండ మరియు వీర సింహారెడ్డి సినిమాలతో వరుసగా రెండు విజయాలను తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే.మూడవ విజయం తో హ్యాట్రిక్ సొంతం చేసుకుని అరుదైన రికార్డు ని తన ఖాతా లో వేసుకోవాలని బాలకృష్ణ ఉవ్విల్లూరుతున్నాడు.
ప్రస్తుతం బాలకృష్ణ సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వం లో రూపొందుతున్న విషయం తెలిసిందే.బాలకృష్ణ 108వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.

మాస్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరించడంలో అనిల్ రావిపూడి కి మంచి పట్టు ఉంది.అందుకే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా కచ్చితంగా మరో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా అలరిస్తుందనే నమ్మకాన్ని ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమా లో బాలకృష్ణ ను 60 ఏళ్ల వ్యక్తి గా అనిల్ రావిపూడి చూపించబోతున్నాడు.ఆయనకు కూతురు పాత్ర లో శ్రీ లీలా కనిపించబోతుంది.అంతే కాకుండా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇన్ని విషయాలు బయటకు లీక్ అయ్యాయి, కానీ ఇప్పటి వరకు సినిమా కు ఏం టైటిల్ అనుకుంటున్నారు అనే విషయం పై క్లారిటీ ఇవ్వలేదు.
అలాగే కనీసం చిన్న లీక్ కూడా అవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు.ఈ సినిమా యొక్క టైటిల్ కోసం చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించే వరకు వెయిట్ చేయాల్సిందే.
సాధారణంగా ఏ సినిమా యొక్క టైటిల్ అయినా ముందుగానే లీక్ అవ్వడం లేదంటే యూనిట్ సభ్యులు అనధికారికంగా పేర్కొనడం జరుగుతుంది.

కానీ బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్ సినిమా యొక్క టైటిల్ కి సంబంధించి ఎలాంటి క్లూ ఇవ్వక పోవడం తో అభిమానులతో పాటు మీడియా సర్కిల్స్ వారు జుట్టు పీక్కుంటున్నారు.ఈ ఏడాది దసరా కి సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా దర్శకుడు అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నాడు.విడుదలకు ముందు మాత్రమే సినిమా యొక్క టైటిల్ ని రివీల్ చేసే అవకాశాలు ఉన్నాయి.







