నీటి సమస్య లేని వార్డుగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం.. 11వ వార్డు కౌన్సిలర్ "ఒగ్గు ఉమా రాజేశం"!

రాజన్న సిరిసిల్ల జిల్లా:వేసవికాలంలో వార్డు ప్రజలకు నీటి ఎద్దడి సమస్యలు తలుత్తకుండా ముందు జాగ్రత్తగా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 11వ వార్డు కౌన్సిలర్ ఓగ్గు ఉమా రాజేశం కాలనీలో ముఖ్యంగా మహిళలు నీటి సమస్యతో వేసవిలో కన్నీళ్లు పెట్టుకోకూడదనే గొప్ప ఆలోచనతో మూడు బోర్లను మంగళవారం శుద్ధి చేయించారు.వేసవికాలం వచ్చిందంటే చాలు వార్డు ప్రజలు నీటి సమస్యతో అల్లాడిపోయేవారని, అందుకోసమే గత సంవత్సర అనుభవాలను దృష్టిలో పెట్టుకుని తమ వార్డు ప్రజలకు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపెట్టాలనే దృఢ సంకల్పంతో స్థానిక కౌన్సిలర్ గా ప్రత్యేక కృషి చేస్తున్నమన్నారు.

 Our Aim Is To Make The Ward Water Free 11th Ward Councilor oggu Uma Rajesham , O-TeluguStop.com

గతంలో నీళ్లు అంటే కన్నీళ్లు వచ్చే పరిస్థితి ఉండేదని నీళ్ల కోసం రోడ్లపై ఖాళీ బిందెలతో మహిళలు నిరసన చేసే వారని కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదని కొనియాడారు.వచ్చే వేసవిలో మంచినీటి సమస్యలు సమస్యలు తలెత్తకుండా వార్డు ప్రజలు కూడా నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.

ఇంటింటికి త్రాగునీరు అందించి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చెప్పిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందని అన్నారు.ఈ సందర్భంగా నేటి సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్తగా బోర్లను శుద్ధి చేయడంతో వార్డు ప్రజలు స్థానిక కౌన్సిలర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube