ఆ సినిమా ఎందుకు చేశానా అనుకున్నాను.. హీరోయిన్ లయ కామెంట్స్ వైరల్?

ఒకప్పటి సీనియర్ హీరోయిన్ లయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.స్వయంవరం సినిమాతో సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన లయ మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.

 Actress Laya About Swayam Varam And Preminchu Movie Latest Interview-TeluguStop.com

అంతేకాకుండా మొదటి సినిమాకు గాను నంది అవార్డు సైతం అందుకుంది.ఇక ఆ తర్వాత ఈమెకు వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి.

ఇక స్వయంవరం సినిమా తర్వాత నటించిన మనోహరం, ప్రేమించు సినిమాలకు గాను నంది అవార్డులు రావడంతో వరుసగా మూడుసార్లు నంది అవార్డులు అందుకున్న ఏకైక నటిగా కూడా లయ గుర్తింపు తెచ్చుకుంది.

Telugu Actress Laya, Maa Balaji, Preminchu, Swayam Varam, Tollywood-Movie

ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా 13 ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది.ఆ తర్వాత ఆమె కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలో పెళ్లి చేసుకుని సినిమా ఇండస్ట్రీకి దూరమైంది.ఇకపోతే హీరోయిన్ లయ ప్రస్తుతం భర్త పిల్లలతో కలిసి అమెరికాలో ఉంటున్న విషయం మనందరికీ తెలిసిందే.

సినిమాలలో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనకు తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను ఫోటోలను వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.ఇది ఇలా ఉంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తనకు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకుంది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. స్వయంవరం సినిమా సమయంలో నేను ఇంటర్ సెకండియర్ చదువుతున్నాను.

సినిమా అయిపోయింది.

Telugu Actress Laya, Maa Balaji, Preminchu, Swayam Varam, Tollywood-Movie

ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చాయి.ఇక ఆ సమయంలోనే తన ఫ్రెండ్ మూవీకి వెళ్దాం అని అడిగినప్పుడు ఎగ్జామ్స్ పెట్టుకుని ఎలా వెళ్తాము చదవాలి కదా అని లయ అనగా అప్పుడు ఆమె స్నేహితురాలు సినిమా ఆడకపోతే ఎలా అనడంతో అప్పుడు లయ అవును కదా అనుకుని ఎగ్జామ్స్ మళ్లీ రాయొచ్చు అనే సినిమాకు వెళ్లిందట.ఇదే విషయాన్ని ఆమె ఇంటర్వ్యూలో చెప్పకు వచ్చింది.

ఆ తర్వాత సినిమా సూపర్ హిట్ అయినందుకు చాలా సంతోషంగా ఉందని అసలు ఊహించలేదని ఆమె తెలిపింది.తర్వాత ప్రేమించు సినిమా గురించి మాట్లాడుతూ తనకు ఆ సినిమా చాలా ప్లస్ అయిందని, కానీ చాలామంది మొదట తనని ఆ సినిమా చేయొద్దని చెప్పారని ఆమె తెలిపింది.

కానీ ప్రేమించే సినిమాలు అందులో తన పాత్రకు మంచి పేరు వచ్చిందని అని తెలిపింది.అనంతరం తన కెరియర్ లో ఏదైనా సినిమా చేయకపోతే బాగుండేది అనుకున్న సినిమా ఏదైనా ఉందా అని యాంకర్ అడగగా.

ఉంది.మా బాలాజీ సినిమా అని తెలిపింది లయ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube