భారత దేశ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కొత్త కొత్త కళాకారులను ప్రోత్సహించడంలో ఆనంద్ మహీంద్రా ఎప్పుడూ ముందుంటారు.
తనకి ఏ ఒక్క విషయం నచ్చినా కూడా ఆ విషయాన్ని తన సోషల్ మీడియా వేదిక ద్వారా పంచుకోకుండా ఉండలేరు.ఈ క్రమంలోనే అతను షేర్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అది ఓ అసాధారణ కళాకారుడికి సంబంధించిన వీడియో.ఆ వీడియో చూస్తే కళాకారులు రాళ్లతో కూడా రాగాలు పలికించగలరు అనే నానుడి మనకు స్ఫురణకు వస్తుంది.
ఈ క్రమంలోనే తాజాగా ఓ కళాకారుడు క్యారెట్ తో సంగీతం పలికించి ఔరా అనిపించాడు.క్యారెట్ ని క్లారినెట్ లా మార్చేసి సంగీతం పలికించి అందరిచేత శెభాష్ అనిపించుకున్నాడు.దీనికి సంబంధించి వీడియోను ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేయటంతో క్యారెట్ సంగీతం సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది.అవును, ఆస్ట్రేలియా సంగీత కళాకారుడు ఓ క్యారెట్ ను క్లారినెట్ గా మార్చేసి సంగీతాన్ని పలికించిన వీడియో ఇపుడు ఆహుతులను అలరిస్తోంది.
అతని సంగీతానికి ఫిదా అయిన ఆనంద్ మహీంద్రా ఈ సృష్టిలో ప్రతి ఒక్కదానిలో కూడా సంగీతాన్ని గుర్తించాలంటూ పిలుపునిచ్చారు.
ఆ విషయాన్ని అతగాడు రియలైజ్ అవుతూ…దీన్నుంచి నేను పొందిన సందేశం ఏమిటంటే, మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కదానిలోనూ సంగీతాన్ని గుర్తించొచ్చు అని” అంటూ సదరు వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు.కాగా ఈ వీడియోను ఇపుడు లక్షల సంఖ్యలో చూస్తున్నారు.ఈ వీడియోని గమనిస్తే క్యారెట్ ను మెషిన్ సాయంతో డ్రిల్ చేసి క్లారినెట్ గా మార్చిన కళాకారుడుని మనం చూడవచ్చు.
ఆనంద్ మహీంద్రా చేసిన క్యాప్షన్ కి ఓ యూజర్ స్పందిస్తూ… మీ చుట్టూ ఉన్న వాటిలో సంగీతాన్ని గుర్తించొచ్చు.అలాగే, మీరు చేసే ప్రతి ఒక్కదానిలోనూ సంతోషాన్ని గుర్తించొచ్చు” అంటూ వాస్తవాన్ని చమత్కారంగా అందంగా చెప్పుకొచ్చాడు.