వాల్తేరు వీరయ్య సక్సెస్‌ తో దర్శకుడు బాబీకి కలిసి వచ్చింది ఎంతో తెలుసా?

దర్శకుడు బాబీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా సంవత్సరాలు అయింది.కానీ ఆయన చేసిన సినిమాలు చాలా తక్కువే.

 Megastar Chiranjeevi Waltair Veerayya Movie Director Bobby Next Film , Megastar-TeluguStop.com

మొదటి సినిమా తోనే సక్సెస్ సొంతం చేసుకున్నా కూడా ఆ వెంటనే వరుసగా సినిమాలు చేయడం లో విఫలమయ్యాడు.అయితే చేసిన సినిమాలు తక్కువే అయినా కూడా స్టార్ హీరోలతో సినిమాలు చేయడం వల్ల మంచి పాపులారిటీని దర్శకుడు బాబీ సొంతం చేసుకున్నాడు.

మొన్న సంక్రాంతి కి వాల్తేరు వీరయ్య సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకుడు బాబీ తదుపరి సినిమా ఏ హీరో తో అనే విషయం లో స్పష్టత లేదు.దర్శకుడు బాబీ తన ప్రతి సినిమా తర్వాత కూడా కాస్త ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్నాడు.

ఈ సారి మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్ హీరో తో చేయడం తో పాటు భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం వల్ల కచ్చితంగా వెంటనే తదుపరి సినిమా మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయని అందరూ భావించారు, కానీ వాల్తేరు వీరయ్య సినిమా తో దర్శకుడు బాబీ కి పెద్దగా కలిసి వచ్చింది ఏమీ లేదని, వెంటనే ఆఫర్స్ దక్కే అవకాశాలు కూడా కనిపించడం లేదని సినీ విశ్లేషకుల మధ్య చర్చ జరుగుతుంది.

ఇప్పటి వరకు దర్శకుడు బాబీ తదుపరి సినిమా కు సంబంధించిన స్క్రిప్ట్ రెడీ చేసుకోలేదని.అసలు హీరో కూడా ఓకే అవ్వలేదని ఇండస్ట్రీ వర్గాల్లో రకరకాలుగా ప్రచారం జరుగుతుంది.భారీ అంచనాల నడుమ రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా సక్సెస్ తర్వాత దర్శకుడు బాబీ వెంటనే మరో మెగా హీరో తో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది.

కానీ ఆ విషయమై ఇప్పటి వరకు అధికారికంగా క్లారిటీ రాలేదు.దర్శకుడు బాబీ యొక్క తదుపరి సినిమా విషయం లో ఎప్పటికీ క్లారిటీ వస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube