పెళ్లిలో కన్నీళ్లు పెట్టుకున్న మంచు మనోజ్.. అసలేం జరిగిందంటే?

సాధారణంగా ప్రతి ఒక్కరూ వారి జీవితంలో పెళ్లి విషయంలో ఎన్నో రకాల కలలు కంటూ వాటిని నెరవేర్చుకోవాలని అనుకుంటూ ఉంటారు.పెళ్లి అనేది ఒక మధురమైన ఘట్టం.

 Manchu Manoj Emotional While Wedding Mounika Reddy Details, Manchu Manoj Emotion-TeluguStop.com

అందులోనూ ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకునే అదృష్టం చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటుంది.ప్రేమించిన వ్యక్తిని ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ ఆనందమే వేరేగా ఉంటుందని చెప్పవచ్చు.

ప్రస్తుతం మన హీరో మంచు మనోజ్ పరిస్థితి కూడా అలాగే ఉంది.మనోజ్ తాను ప్రేమించిన మౌనిక రెడ్డిని తాజాగా వివాహం చేసుకున్న విషయం తెలిసింది.

వీరి బంధం మొదటి స్నేహం, స్నేహం నుంచి ప్రేమగా ఆ తర్వాత పెళ్లి పీటలు ఎక్కి ప్రస్తుతం భార్యాభర్తలు గా మారారు.ఇద్దరు తాజాగా ఫిబ్రవరి 3వ తేదీన వేదమంత్రాల సాక్షిగా అగ్నిసాక్షిగా ఒకరికొకరు తోడుగా ఉంటామని ప్రమాణం చేసుకుంటూ మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు.ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.వీరి పెళ్లి మంచు లక్ష్మి ఇంట్లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.

పెళ్లి తర్వాత మంచు మనోజ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా మరో ట్వీట్ చేశారు మంచు లక్ష్మి. పెళ్లికి సంబంధించిన ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ రెండు హృదయాలు, కానీ మనసు ఒక్కటే.ఇలాగే ఎప్పటికీ.

అంటూ వెడ్డింగ్‌ మూమెంట్స్‌ని షేర్‌ చేసింది.ఇది ఇలా ఉంటే పెళ్లి సమయంలో మంచు మనోజ్,మౌనిక ఇద్దరు కూడా ఎమోషనల్ అయ్యారు.

సాధారణంగా తాళి కట్టే సమయంలో జీలకర్ర బెల్లం సమయంలో ఆడపిల్లలు ఎక్కువగా ఎమోషనల్ అవుతూ ఉంటారు.కానీ మంచు మనోజ్ మౌనికలు జీలకర్ర బెల్లం పెడుతూ కంటి చాటున దాగి ఉన్న ఎమోషన్‌ను దాచుకోలేకపోయారు.

ఎంతోకాలంగా ఎదురుచూసిన క్షణం రావడంతో ఆనందంతో ఇద్దరు కన్నీళ్లు పెట్టకున్నారు.అటు మౌనిక కూడా మోహన్‌ బాబును పట్టుకొని ఎమోషనల్‌ అయిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube