సిరిసిల్ల నియోజకవర్గం ఎమ్మెల్యే, ఐటి శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు.ఉదయం 11 గంటలకు తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూం, సరస్వతి విగ్రహ షెడ్డు, సోలార్ ప్లానెట్ ప్రారంభోత్సవం,ఉదయం 11.30 గంటలకు జిల్లెల్లలో హెల్త్ సబ్ సెంటర్ ప్రారంభోత్సవంచేయనున్నారు.
అలాగే మధ్యాహ్నం 12 గంటలకు మల్లాపూర్ గ్రామపంచాయతీ భవనం ప్రారంభోత్సవం,మధ్యాహ్నం 12.30 గంటలకు దేశాయిపల్లి లో ప్రగతిప్రాంగణం, పాఠశాల తరగతి గదుల ప్రారంభోత్సవం , గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని అలాగే మధ్యాహ్నం 1 గంటలకు సిరిసిల్ల పట్టణంలో షాదీఖానా ప్రారంభోత్సవం,మధ్యాహ్నం 1.30 గంటలకు రగుడు జంక్షన్ సుందరీకరణ పనుల నిర్మాణానికి శంఖుస్థాపన,మధ్యాహ్నం 2 గంటలకు కలెక్టరేట్ కార్యాలయ ఆవరణంలో చైల్డ్ కేరింగ్ సెంటర్ ప్రారంభోత్సవం, మధ్యాహ్నం 3 గంటలకు సిరిసిల్ల టౌన్ ప్రెస్ క్లబ్ ప్రమాణస్వీకారోత్సవానికి మంత్రి కేటీఆర్ హాజరవుతున్నారు.