'ఎన్టీఆర్30' నుండి బిగ్ అప్డేట్.. రేపటి కోసం అంతా వెయిటింగ్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ”ఎన్టీఆర్30”.ఈ సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాదు.

 Interesting Update For Ntr30 Details, Ntr30, Ntr, Koratala Shiva, Janhvi Kapoor,-TeluguStop.com

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు.త్రిపుల్ ఆర్ సినిమాతో భారీ స్టార్ డమ్ అందుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా వెలుగొందు తున్నాడు.

ఈ సినిమా ఇచ్చిన హిట్ తో ఎన్టీఆర్ ఆ తర్వాత సినిమాలన్నీ పాన్ ఇండియా వ్యాప్తంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.ఈ క్రమంలోనే తన 30వ సినిమాను కొరటాల దర్శకత్వంలో ఫిక్స్ చేసాడు.

ఈ సినిమా ప్రకటించి ఏడాదికి పైగానే అవుతున్న ఇంకా సెట్స్ మీదకు తీసుకు వెళ్లలేక పోయాడు.ఇప్పటికీ ఇంకా షూట్ స్టార్ట్ చేయలేదు.

అయితే ఈ సినిమా వచ్చే ఏడాది 2024లో ఉంటుంది అని మార్చి నుండి షూట్ స్టార్ట్ కాబోతుంది అని అధికారికంగా ప్రకటన వచ్చింది.మరి మేకర్స్ ఈ సినిమాను ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చూడాలి.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి సాలిడ్ అప్డేట్ రాబోతుంది అని తెలుస్తుంది.ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను ఫిక్స్ చేసారని సమాచారం బయటకు వచ్చింది.

అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం రేపు ఈ సినిమా నుండి జాన్వీ కపూర్ గురించి అప్డేట్ రాబోతున్నట్టు తెలుస్తుంది.ఎందుకంటే జాన్వీ కపూర్ మార్చి 6న పుట్టిన రోజు జరుపు కోనుంది.ఈ క్రమంలోనే ఈమె బర్త్ డే రోజు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉందట.ఈ సినిమా నుండి హీరోయిన్ గా ఈమె ఫిక్స్ అయితే ఖచ్చితంగా అప్డేట్ అయితే వస్తుంది.

ఇక పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను యువ సుధా ఆర్ట్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు భారీగా స్థాయిలో నిర్మిస్తుండగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube