వాహన రంగంలో కంపెనీల మధ్య గట్టి పోటీ ఉండడంతో మార్కెట్లో టెక్నాలజీ తో కూడిన కొత్త రకం వాహనాలు విడుదల అవుతూనే ఉన్నాయి.అయితే టెక్నాలజీ లోని మార్పులు వాహనదారులకు గుబులు పుట్టిస్తోంది.

వాహనాలు తయారు చేసే కంపెనీలు సెల్ఫ్ డ్రైవింగ్ కార్లపై దృష్టి పెట్టాయి.కాగా అమెరికాలోని టెస్లా కంపెనీ నుంచి సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు మార్కెట్లో తిరుగుతున్నాయి.కారుకు డ్రైవర్ ఉన్నా కూడా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.ఇక కారులో డ్రైవర్ లేకుండా నడిచే కార్లతో ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయో అని వాహనదారులు గందరగోళంలో ఉన్నారు.
జనరల్ మోటార్స్ కు చెందిన cruise, గూగుల్ కు చెందిన Waymo కంపెనీలు తయారుచేసిన సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు టెస్టింగ్ మోడ్ లో ఉన్నాయి.వీటితోపాటు ప్రముఖ కంపెనీలైన ఆడి, నిస్సాన్, వోల్వో లాంటి పెద్ద కంపెనీలు కూడా సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల తయారీపై దృష్టి సారించడంతో వాహనదారులు భయానికి గురవుతున్నారు.

అమెరికా నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ విభాగం కార్ల ప్రమాదాలపై సర్వే చేసి దాదాపు 70 శాతం మంది ప్రజలు సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలకు భయపడుతున్నారని తేల్చింది.ఇంకా కొంతమంది వాహనాన్ని సెల్ఫ్ డ్రైవింగ్ మోడ్ లో ఉంచి నిద్రపోతున్నారని సర్వే ద్వారా బయటపడింది.
అమెరికాలో సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల ప్రమాదాలలో ఎక్కువ శాతం టెస్లా కంపెనీకి చెందినవే ఉన్నాయి.టెస్లా కంపెనీ 3,63,000 సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను రీ కాల్ చేసింది.
దీనికి ప్రధాన కారణం పరిమిత వేగంతో వెళ్తున్న కార్లు అకస్మాత్తుగా నిర్దిష్ట వేగానికి మించి దూసుకెళ్లి ప్రమాదాలకు గురవుతున్నాయి.
సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు తయారు చేసే కంపెనీలు వీటన్నిటిపై దృష్టి పెట్టి, భవిష్యత్తు ప్రమాదాలను అంచనా వేసి మెరుగైన టెక్నాలజీతో కార్లను తయారు చేయాలని వాహన రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.







