టాటా మోటార్స్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు.భారత కార్ల మార్కెట్‌లో దూసుకుపోతున్న సంస్థ టాటా మోటార్స్.
ఈ క్రమంలో శుక్రవారం అనగా 2023 మార్చి మూడో తేదీ నాటికి మరో మైలురాయిని దాటింది.అవును, 50 లక్షల కార్ల తయారీ మార్క్‌ను దాటేసింది.
టాటా సన్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు అయినటువంటి జంషెడ్జీ టాటా 183వ జయంతి సందర్భంగా టాటా మోటార్స్ ఈ మార్క్‌ను చేరుకోవడం వలన టాటా గ్రూప్ పండగ చేసుకుంటోంది.కంపెనీ న్యూ ఫర్ఎవర్ రేంజ్ కార్ల గురించి గ్రౌండ్‌పై `50 లక్షలు` అని రాశారు.
ఆ జాబితాలో నెక్సాన్, పంచ్, ఆల్ట్రోజ్, టియాగో, హారియర్, టైగోర్, సఫారీ తదితర మోడల్ కార్లు ఉన్నాయి.ఈ సందర్భంగా కంపెనీ డీలర్‌షిప్‌లు, సేల్స్ ఔట్‌లెట్ల వద్ద సిబ్బందికి ప్రత్యేకంగా దుస్తులు, బహుమతులను టాటా మోటార్స్ పంపిణీ చేయనున్నట్లు తాజాగా ప్రకటించడం కొసమెరుపు.గత రెండున్నరేండ్లలోనే పది లక్షల కార్లు తయారు చేశామని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ లిమిటెడ్ టాటా రేంజ్ ఎలక్ట్రిసిటీ మొబిలిటీ మేనేజింగ్ డైరెక్టర్ శైలేశ్ చంద్ర చెప్పుకొచ్చాడు.కొవిడ్-19 మహమ్మారి వల్ల సెమీ కండక్టర్ల కొరతతో కార్ల తయారీ గణనీయంగా దెబ్బ తిన్నది.ఇప్పుడిప్పుడే ఉత్పత్తి గాడిలో పడుతున్నది.
ఇకపోతే 1977లో టాటా మోటార్స్ తన పుణె ప్లాంట్ నుంచి తొలి కమర్షియల్ వెహికల్ రోడ్డు మీదకు తీసుకొచ్చిన సంగతి విదితమే.ఆ తరువాత 1991లో తొలి ప్యాసింజర్ వెహికల్ టాటా సిర్రాను ఆవిష్కరించింది.టాటా మోటార్స్ ఇండికా కారుకు అయితే కస్టమర్ల నుంచి చాలా సానుకూల స్పందన లభించింది.
నాటి నుంచి విభిన్న సెగ్మెంట్లలో పలు రకాల మోడల్ కార్లను కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది.ఇప్పుడు కంపెనీ పోర్ట్‌ఫోలియోలో సఫారీ, సుమో, ఇండిగో, హారియర్, పంచ్, నెక్సాన్, టియాగో, టైగోర్, నానో, ఆల్ట్రోజ్ వంటి మోడల్ కార్లు తీసుకొచ్చింది.
ప్రస్తుతం దేశీయ ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్‌లో టాటా మోటార్స్‌దే అత్యధిక వాటా.