ప్రస్తుత సమాజంలో అక్రమ సంబంధాలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి.వివాహ బంధం కన్నా అక్రమ సంబంధనికే ప్రాధాన్యత పెరిగిపోతుంది.
భాగస్వామి మోజులో పడి, పిల్లలను అనాధ చేసి కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు.వివాహం తర్వాత భార్య భర్తలు ఇద్దరూ పరాయి వ్యక్తుల ఆకర్షణకు లోనై అక్రమ సంబంధాలు పెట్టుకుని, అవి బయటపడ్డాక దారుణాలు చేయడానికి ఏమాత్రం ఆలోచించడం లేదు.
ఇటీవలే జరిగిన ఒక విచిత్ర సంఘటన గురించి తెలిసే, ఇలాంటి వారు కూడా ఉన్నారా ఈ సమాజంలో అనిపిస్తుంది.

తిరుపతి నగరంలోని చంద్రగిరిలో రంగ పేటకు చెందిన వంశీ నివాసం ఉంటూ అన్వర్ అనే ఫైనాన్షియర్ దగ్గర ఆటో తీసుకొని జీవనం సాగించేవాడు.ఈ క్రమంలో వంశీ భార్యకు అన్వర్ తో పరిచయం ఏర్పడింది.ఆ పరిచయం అక్రమ సంబంధానికి దారి తీయడం, అసలు విషయం వంశీకి తెలియడంతో భార్యను హెచ్చరించి ఉపాధి నిమిత్తం బెంగళూరుకు వెళ్ళాడు.
భార్య ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో వంశీ సోషల్ మీడియాలో ఆర్ ఐ పి అంటూ అన్వర్ కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడంతో, వంశీ పై కక్ష పెంచుకున్నాడు అన్వర్.

అన్వర్ తన స్నేహితుడు హర్ష సహకారంతో బెంగళూరులో వంశీని కిడ్నాప్ చేసి చంద్రగిరికి తీసుకువచ్చి ఒక గదిలో పది రోజులుగా బంధించి చిత్రహింసలకు గురి చేస్తూ తలపై మూత్రం పోసి, గుండు కొట్టించాడు.వంశీ తో క్షమాపణలు చెప్పించుకున్న అన్వర్, దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.ఒక కానిస్టేబుల్ సహకరించడంతో అన్వర్ ఇలా బరితెరిగించి ప్రవర్తించాడు.
కానీ వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఈ వీడియో పై కేసు నమోదు చేసి నిందితులైన అన్వర్, హర్షలను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.భార్య అక్రమ సంబంధం పై భర్త నిలదీయడంతో, ఇలాంటి దారుణం జరగడంతో స్థానికంగా ఈ సంఘటన కలకలం రేపింది.







