కొద్దిరోజుల క్రితం గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడికి సంబంధించిన గొడవలో టీడీపీ నేత పట్టాభి అరెస్ట్ కావటం తెలిసిందే.ఈ కేసులో పలు సెక్షన్ల కింద ఆయనతో పాటు పలువురిపై కేసు నమోదు అయింది.
ఈ క్రమంలో పట్టాభికి విజయవాడ స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది.కస్టడీకి ఇవ్వాలని పోలీసుల వాదనను న్యాయస్థానం తిరస్కరించడం జరిగింది.
బెయిల్ కోసం 25 వేల రూపాయల చొప్పున ఇద్దరూ షూరిటీలు ఇవ్వాలని పేర్కొంది.
ఇదే సమయంలో సాక్షులను ప్రభావితం చేయకూడదని జడ్జ్ సూచించడం జరిగింది.
అదేవిధంగా మూడు నెలల పాటు ప్రతి గురువారం పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని స్పష్టం చేయడం జరిగింది.కేసు విచారణకు సహకరించాలని న్యాయమూర్తి ఆదేశించారు.
గన్నవరం టిడిపి.వైసిపి పార్టీల మధ్య జరిగిన గొడవలో… టిడిపి పార్టీ కార్యాలయంలో వాహనాలు ఫర్నిచర్ ధ్వంసం కావడం జరిగింది.
అదే గొడవలో సీఐ కనకారావు తనను టిడిపి నేత పట్టాభి.మరి కొంతమంది నాయకులు కులం పేరుతో దూషించారని ఫిర్యాదు చేయటంతో… ఎస్సీ ఎస్టీ కేసు నమోదు కావడం జరిగింది.







