చిన్నపిల్లలు దైవంతో సమానం అంటారు.ఆ విషయాన్ని నిజం చేస్తూ తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.
కాగా ఆ వీడియో చూసిన నెట్టింట్లో జనాలు ఆ పిల్లలని ఆకాశానికెత్తేస్తున్నారు.అవును, నేటి సమాజంలో దయాగుణం కలిగినవారు చాలా అరుదుగా కనిపిస్తుంటారు.
మనసంతా కరుణ కలిగిన ఓ బాలుడి వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఆ బాలుడు చేసిన పని ఎంతో స్ఫూర్తిదాయకంగా వుంది.
విషయం ఏమంటే, వలలో ఓ కాకి చిక్కుకొని విలవిలలాడుతోంది.అది ఎప్పటినుండి అలా వుందో ఎవ్వరికీ తెలియదు.అయితే దాన్ని ఓ స్కూల్ బాలుడు చూసి, మనసు కరిగి దానిని కాపాడాడు.ఆ వెంటనే ఆ కాకిని గాల్లోకి వదిలేసాడు.
ఆ వయసు పిల్లలు మరెవరైనా ఐతే దానిని కాపాడిన తరువాత దానితో ఆడుకోవాలని చూసేవారు.కానీ ఆ కుర్రాడు అలా చేయలేదు.
కాగా దానికి స్వేచ్ఛ ప్రసాదించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.సబితా చంద అనే యూజర్ ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేయగా అది కాస్త వైరల్ అవుతోంది.
సదరు వీడియో ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ 76,000 మందికి పైగా చూడడం కొసమెరుపు.ఆ బాలుడు ఆ కాకిని రక్షించే సమయంలో అతడి క్లాస్మేట్స్ కూడా చుట్టూ చేరి పక్షికి స్వేచ్ఛ లభించడంతో ఆనందంతో చప్పట్లు కొట్టడం జరిగింది.వారి కరుణామయ హృదయం ఎన్నో జీవితాలను స్పృశిస్తుందని ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇవ్వడం ఇక్కడ గమనించవచ్చు.కామెంట్స్ సెక్షన్లో ట్విట్టర్ యూజర్లు స్కూల్ బాలుడిపై ప్రశంసలు గుప్పించారు.
ఈ బాలుడికి చాలా దయాగుణం ఉందని ఓ యూజర్ కామెంట్ చేయగా ఎంతో సునిశితమైన బాలుడని మరో యూజర్ రాసుకొచ్చారు.