వరంగల్ మెడికో ప్రీతి ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే.సీనియర్ సైఫ్ వేధింపుల వల్ల హానికారమైన ఇంజక్షన్ ను తీసుకున్న ప్రీతి ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడి మృతి చెందారు.
సైఫ్ ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయగా 2 ఘటనల వల్ల ప్రీతిపై సైఫ్ కోపం పెంచుకున్నాడని వెల్లడైంది.సైఫ్ ప్రీతి గురించి వాట్సాప్ గ్రూప్స్ లో హేళన చేయడంతో పాటు రెస్ట్ లేకుండా పని ఉండేలా చేశాడు.
సైఫ్ ను కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘాల నుంచి డిమాండ్ వ్యక్తమవుతోంది.అయితే ఈ తరహా ఘటనలు చోటు చేసుకోవడం ఇదే తొలిసారి కాదు.మూడేళ్ల క్రితం మహారాష్ట్ర రాష్ట్రంలో ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది.పాయల్ తాద్వి అనే మెడికో పీజీ గైనకాలజీ చదువుతుండగా ముగ్గురు సీనియర్లు నీకు చదువు అవసరమా అంటూ ఏడిపించారు.
ఆ ముగ్గురు సీనియర్లు అమ్మాయిలు కావడం గమనార్హం.

ఆమె గురించి హేళనగా మాట్లాడుతూ ముగ్గురు సీనియర్లు ప్రతిరోజూ ఆమెను మానసికంగా టార్చర్ చేశారు.పాయల్ కు మాత్రమే ఎక్కువగా నైట్ షిఫ్ట్ డ్యూటీలు వేస్తూ వేధించారు.ఈ వేధింపులను భరించలేక పాయల్ తాద్వి ఆత్మహత్య చేసుకున్నారు.
కేసులో నిందితులైన ముగ్గురు సీనియర్ అమ్మాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు.ఆ ముగ్గురు అమ్మాయిల చదువులు మధ్యలోనే ఆగిపోయాయి.

ఈ కేసు మహారాష్ట్రలో సంచలనం సృష్టించగా కేసుకు సంబంధించి తుది తీర్పు వెలువడాల్సి ఉంది.ర్యాగింగ్ కు వ్యతిరేకంగా కాలేజీలు, యూనివర్సిటీలలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.పాయల్, ప్రీతి ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా కాలేజీల యజమాన్యాలు చర్యలు చేపట్టాల్సిన అవసరం అయితే ఉంది.ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు సైతం జాగ్రత్త పడాల్సి ఉంది.







