ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ డోర్సే గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.2021 నవంబర్ లో ట్విట్టర్ సీఈవో బాధ్యతల నుండి పూర్తిగా తప్పుకున్నారు జాక్ డోర్సే.ఈయన స్థానంలో సీఈఓ గా పరాగ్ అగర్వాల్ కొంతకాలం బాధ్యతలు వ్యవహరించారు.ట్విట్టర్ ను ఎలన్ మాస్క్ కొనడంతో పరాగ్ అగర్వాల్ కూడా ట్విట్టర్ కు దూరమయ్యారు.
ట్విట్టర్ లో జరుగుతున్న పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ట్విట్టర్ అనేది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా కాకుండా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఉంటే మంచిదని తన అభిప్రాయాన్ని కూడా తెలిపాడు.

ట్విట్టర్ నుండి బయటకు వచ్చాక సోషల్ మీడియా ప్లాట్ ఫారం పై కొత్త యాప్ ను తీసుకొచ్చి ట్విట్టర్ కు గట్టి పోటీ ఇస్తారనే ప్రచారం బాగానే జరిగింది.ప్రస్తుతం ఆ ప్రచారం నిజమైంది.సోషల్ మీడియా యూజర్లకు ఒక మంచి వేదికగా ఉండాలని ఆలోచనతో బ్లూ స్కై అనే కొత్త యాప్ ను ట్విట్టర్ కు పోటీగా తీసుకువచ్చారు జాక్ డోర్సే.
టెస్టింగ్ స్టేజ్లో ఉన్న ఈ యాప్ యాపిల్ యాప్ స్టోర్లో అందుబాటులో ఉంది.ఇది ఒక సైట్ లోనే కాదు పలు సైట్లలో పనిచేస్తుంది.దీనిని ఫిబ్రవరి 15న బ్లూ స్కై ios యాప్ తో మొదలుపెట్టారు.ఇప్పటికే దాదాపుగా 2000 మంది యూజర్లు ఇన్స్టాల్ చేసుకున్నారు.

ట్విట్టర్లో what’s happening? అని వస్తే బ్లూ స్కై లో what’s up? అని వస్తుంది.ఇందులో ఇష్టం లేని అకౌంట్లను మ్యూట్ చేయడం, బ్లాక్ చేయడం, షేర్ చేయడం వంటి ఫీచర్స్ ఉండడంతో పాటు మరికొన్ని అడ్వాన్స్ ఫీచర్లతో అందుబాటులోకి రానుంది.బ్లూ స్కై ఆప్ లో నోటిఫికేషన్లు, షేర్లు, కామెంట్స్ ఆప్షన్లతో పాటు ఇండివిడ్యూవల్స్ గా సెర్చ్ చేయడం తో పాటు వారి ప్రొఫైల్ కూడా చూసే ఆప్షన్ ఉంటుంది.ట్విట్టర్ సెక్యూరిటీ ఇంజనీర్ ఈ ప్రాజెక్టులో భాగస్వామి.
జాక్ బోర్డు సభ్యుల లో ఒకరిగా ఉంటూ భవిష్యత్తులో ట్విట్టర్ కు బ్లూ స్కై గట్టి పోటీ ఇచ్చే పరిణామాలు కనిపిస్తున్నాయి.







