టాలీవుడ్ హీరోలలో ఒకరైన నితిన్ ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించినా ఆయన సినిమాలలో సక్సెస్ సాధించిన సినిమాలు తక్కువగానే ఉన్నాయి.నితిన్ గత సినిమా మాచర్ల నియోజకవర్గం ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.
ఓటీటీలో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రాలేదు.కొన్నిరోజుల క్రితం ఈ సినిమా బుల్లితెరపై ప్రసారమైంది.ఈ సినిమాకు బుల్లితెరపై 4.8 టీఆర్పీ రేటింగ్ వచ్చింది.
ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకుడు కాగా ఈ సినిమా విడుదలకు ముందే దర్శకుడు వివాదాల్లో చిక్కుకోవడం కూడా ఈ సినిమాకు మైనస్ అయింది.యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కగా జీ తెలుగు ఛానల్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ఈ సినిమా ప్రసారం కావడం గమనార్హం.
ఈ సినిమా రేటింగ్ ను చూసి నితిన్ అభిమానులు సైతం ఒకింత షాకవుతున్నారు.

కేథరిన్, అంజలి కూడా మాచర్ల నియోజకవర్గంలో కనిపించినా సినిమా మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చలేదు.నితిన్ కథల ఎంపికలో జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంది.నితిన్ భవిష్యత్తు ప్రాజెక్ట్ ల విషయంలో స్టార్ డైరెక్టర్లకు ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
నితిన్ ప్రాజెక్ట్ లు సొంత బ్యానర్ లో ఎక్కువగా తెరకెక్కుతున్నాయి.

నితిన్ సినిమాలకు భారీ స్థాయిలో ఖర్చవుతుండగా అదే స్థాయిలో ఆయన సినిమాలకు కలెక్షన్లు రావడం లేదు.నితిన్ మాస్ సినిమాలను పక్కన పెట్టి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కథలపై దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది.నితిన్ పారితోషికం కూడా తక్కువగానే ఉందని బోగట్టా.
నితిన్ మల్టీస్టారర్స్ లో నటించాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.నితిన్ రాబోయే రోజుల్లో వరుస విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.







