పూరి జగన్నాథ్ తన ఫస్ట్ సినిమా అయిన బద్రి స్టోరీ ని పవన్ కళ్యాణ్ కోసం కాకుండా వేరే హీరో కోసం రాసుకున్నరాట అయితే ఈ సినిమా అప్పట్లో చాలా పెద్ద హిట్ అయింది ముఖ్యం గా ఈ సినిమాతోనే పవన్ కళ్యాణ్ మెడ దగ్గర చేయి పెట్టుకునే స్టైల్ వచ్చింది పవన్ కళ్యాణ్ ఇప్పటికీ అదే స్టైల్ ని మెయింటైన్ చేస్తున్నాడు…

అయితే ఈ స్టోరీ ని పూరి మొదటి నాగార్జున ని హీరోగా అనుకొని రాసుకున్నారట కానీ ఆయన ఆ టైం లో చాలా సినిమాలకి కమిట్ అయి ఉండడం వల్ల పూరి కి డేట్స్ ఇవ్వలేక పోయాడు.దాంతో పూరీకి పవన్ కళ్యాణ్ తో అవకాశం రావడంతో పూరి ఈ సినిమా ని పవన్ కళ్యాణ్ తో చేసినట్లు తెలుస్తుంది…అయితే పవన్ కళ్యాణ్ లాంటి యంగ్ హీరోతో తన మొదటి సినిమా చేసినందుకు పూరి ఇప్పటికీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు… ఇక పూరి పేరుకి ఇండస్ట్రీ లో ఒక బ్రాండ్ వాల్యూ ఉంది అలాంటి పూరి ని ఇండస్ట్రీ కి పరిచయం చేసింది పవన్ కళ్యాణ్ కాబట్టి ఈ విషయం లో పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా సంతోష పడుతుంటారు…

బద్రి సినిమా అనేది అటు పూరి కి ఇటు పవన్ కి చాలా గుర్తుండిపోయే సినిమా అనే చెప్పాలి ఎందుకంటే అప్పట్లో ఆ సినిమా ఇచ్చిన ఇంపాక్ట్ అలాంటిది ఇప్పటికీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ సినిమా రీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు తొందరలోనే ఈ సినిమా రీ రిలీజ్ చేసే ఆలోచన లో ఉన్నారు…అలాగే పూరి జగన్నాథ్ నాగార్జున కాంబినేషన్ లో ఆ తర్వాత సూపర్, శివమణి అనే రెండు సినిమాలు వచ్చాయి సూపర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అయింది కానీ శివమణి మాత్రం నాగార్జున కెరియర్ లో ఒక మంచి హిట్ సినిమా గా నిలిచింది అనే చెప్పాలి.వీళ్ళ కాంబోలో ఇంకో సినిమా కూడా రావాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది.నిజ జీవితంలో పూరి నాగార్జున మంచి స్నేహితులు.
ఏ విషయం ఉన్న ఇద్దరు షేర్ చేసుకునేంత మంచి ఫ్రెండ్స్ వీళ్ళ కాంబో లో ఇంకో సినిమా వచ్చిన రావచ్చు…
.







