అంగన్ వాడీ సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ చిన్నారి నరకయాతన అనుభవించింది.ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కాజీపల్లిలో చోటు చేసుకుంది.
కాజీపల్లిలోని అంగన్ వాడీ కేంద్రానికి ఓ చిన్నారి రోజులానే వెళ్లింది.అయితే చిన్నారి అవంతిక స్కూల్ లో ఉండగానే సిబ్బంది తాళం వేసి వెళ్లిపోయారు.
ఈ క్రమంలో అవంతిక కోసం గ్రామం అంతా గాలించారు తల్లిదండ్రులు.చివరికి అనుమానం వచ్చి అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి చూడగా స్టోర్ రూమ్ లో అపస్మారక స్థితిలో కనిపించింది.
వెంటనే స్పందించిన గ్రామ సర్పంచ్ ఆయాలను పిలిపించి తాళాలు తీయించారు.బయటకు తీసుకువచ్చిన తరువాత చిన్నారి సృహాలోకి రావడంతో ఊపిరి పీల్చుకున్నారు.
అయితే అంగన్వాడీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అవంతిక తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.







