అప్పుడప్పుడు జనాలకు సెలబ్రెటీలు చేసే పనులు నచ్చకపోవడంతో వెంటనే వారిని ఆ పనులు చేయొద్దు అంటూ సలహాలు ఇస్తూ ఉంటారు.మరి కొంతమంది ట్రోల్స్ చేస్తూ ఉంటారు.
అయినా కూడా సెలబ్రెటీలు వచ్చే కామెంట్లను పట్టించుకోకుండా తమకు నచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటారు.దీంతో కొన్నిసార్లు నెటిజన్స్ విసుగు చెందుతూ ఉంటారు.
తాజాగా జబర్దస్త్ వర్ష విషయంలో కూడా విసుగు చెందారు.ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.
బుల్లితెర ఆర్టిస్ట్, జబర్దస్త్ బ్యూటీ వర్ష.ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు అందరికీ పరిచయం.బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించి తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది.అంతేకాకుండా జబర్దస్త్ లో కమెడియన్ గా నిలిచి తన పర్ఫార్మెన్ తో మంచి పేరు సంపాదించుకుంది.
మోడల్ గా కూడా చేసింది వర్ష.జబర్దస్త్ లో కేవలం గెస్ట్ గా పాల్గొన్న వర్ష ఆ తర్వాత అక్కడే సెటిలై బుల్లితెర ప్రేక్షకులతో మరింత ఎక్కువ పరిచయం పెంచుకుంది.

సోషల్ మీడియాలో కూడా తన ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది ఈ బ్యూటీ.అతి తక్కువ సమయంలో జబర్దస్త్ లో ఇంత క్రేజ్ అందుకోవడానికి కారణం మరో ఆర్టిస్ట్ ఇమ్మాన్యుయేల్ అని చెప్పవచ్చు.అతనితో స్కిట్ లో భాగంగా హగ్, కిస్ లతో బాగా రెచ్చిపోతుంది.నిజానికి వీరిద్దరూ చేసే రచ్చ చూస్తే మాత్రం చూసి ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు.

ఎందుకంటే వీరిద్దరూ షో లలో బాగా ఓపెన్ గా రెచ్చిపోతారు కాబట్టి.ఇక గతంలో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని అందరూ అనుకున్నారు.కానీ అదంతా కేవలం షో కోసమని రేటింగ్ కోసమని తెలిసింది.ఇక తర్వాత జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో కూడా అవకాశాన్ని అందుకుంది ఈ హాట్ బ్యూటీ.
అందులో కూడా ఇమ్మాన్యుయేల్ తో బాగా రెచ్చిపోయింది.ఆ తరువాత అలా మరిన్ని షో లలో గెస్ట్ గా పాల్గొని బాగా ఆకట్టుకుంటుంది.జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ లో తన నటనకు మంచి మార్కులే సంపాదించుకుంది.కానీ జబర్దస్త్ లో అడుగు పెట్టాక ఆ సీరియల్ కు దూరమైంది.

ఇక వరుస షో లతో బుల్లితెరపై తనకంటూ ఒక క్రేజీ సంపాదించుకొని బాగా దూసుకెళ్తుంది.ఏదైనా పండుగ ఈవెంట్ వస్తే చాలు ఆ సమయంలో మరింత రెచ్చిపోతుంది.ఏ వేషం వేయటానికైనా దిగజారుతుంది.ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.తనకు సంబంధించిన హాట్ ఫోటోలను బాగా షేర్ చేసుకుంటుంది.అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెడుతుంది.
ఇక ఈమె సోషల్ మీడియాలో షేర్ చేసుకునే ఫోటోలు చూస్తే మతి పోవడం గ్యారెంటీ.

ఎందుకంటే తన అందాలు అలా ఉంటాయి కాబట్టి.పొట్టి పొట్టి బట్టలు వేస్తూ అందరు చూపులు తన వైపు మలుపుకునేలా చేస్తుంది.ఇదంతా పక్కన పెడితే తాజాగా తను ఒక వీడియో పంచుకోగా.
అందులో చాలా సన్నగా కనిపించింది.ఇక తను వేసుకున్న డ్రెస్ కూడా అంతగా సెట్ కాలేదు.
పైగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అస్సలు మ్యాచ్ కాలేదు.దీంతో ఆ వీడియో చూసి నెటిజన్స్ రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
ప్లీజ్ అండి దండం పెడతా.రీల్ చేయడం ఆపేయండి.
మీకు తగ్గట్టు ఆ బిజిఎం సెలక్షన్లు ఒకటి అంటూ కామెంట్ చేయగా.ఆ పాట పేరు కూడా మొన్నటిదాకా తెలీదు కదా.ఎందుకు అతి చేస్తావు చెప్పు.నాశనం చేయడానికి బాబు అంటూ కామెంట్లు పెడుతున్నారు.








