దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితులకు బెయిల్ వచ్చింది.ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఐదుగురు నిందితులకు 30 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
మద్యం కుంభకోణం కేసులో సమీర్ మహేంద్రు ఇటీవల వైద్య చికిత్స నిమిత్తం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.ఆయనతో పాటు అరుణ్ రామచంద్ర పిళ్లై, ముత్తా గౌతమ్, కుల్దీప్ సింగ్, నరేంద్ర సింగ్ ల బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం విచారించింది.
ఈ నేపథ్యంలోనే సీబీఐ కేసులో రామచంద్ర పిళ్లై,ముత్తా గౌతమ్, కుల్దీప్ సింగ్, నరేంద్ర సింగ్ లకు… ఈడీ కేసులో సమీర్ మహేంద్రుకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.నిందితులు ఒక్కొక్కరు రూ.లక్ష పూచీకత్తుతో పాటు ష్యూరిటీ ఇవ్వాలని పేర్కొంది.అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని, సాక్షులను ప్రభావితం చేసే చర్యలకు పాల్పడవద్దని ఆదేశాలు జారీ చేసింది.
అదేవిధంగా షరతులు అతిక్రమిస్తే బెయిల్ రద్దు చేస్తామన్న ధర్మాసనం అధికారులు పిలిచినప్పుడు విచారణకు హాజరు కావాలని పేర్కొంది.







