పవన్ ముఖ్యమంత్రి కావడంపై స్పందించిన నటి లయ.. ఏమన్నారంటే?

స్వయంవరం సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నటి లయ మొదటి సినిమాతోనే ఏకంగా నంది అవార్డు అందుకున్నటువంటి లయ తర్వాత సినిమాలకు కూడా పలు అవార్డులను అందుకున్నారు.ఇలా నటిగా ఇండస్ట్రీలో దాదాపు 13 సంవత్సరాలు పాటు ఓ వెలుగు వెలిగినటువంటి ఈమె ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి లయ తన కెరియర్ గురించి ఎన్నో విషయాలను తెలియజేశారు.

 Actress Laya Reacted To Pawan Becoming Chief Minister What Did She Say ,actress-TeluguStop.com

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావన రావడంతో ఈమె పవన్ గురించి ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా యాంకర్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాలలో కూడా ఎంతో బిజీ అయిన విషయం మనకు తెలిసిందే.అయితే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారా అంటూ హీరోయిన్ లయను ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు లయ సమాధానం చెబుతూ తనకు రాజకీయాల గురించి పెద్దగా అవగాహన లేదని తెలిపారు.

అయితే పవన్ కళ్యాణ్ గారికి మాత్రం సీఎం అయ్యే లక్షణాలు చాలా ఉన్నాయని అయితే ఆయన సీఎం కావాలా వద్దా అన్నది ప్రజలు డిసైడ్ చేస్తారని తెలిపారు.

ఇక పవన్ కళ్యాణ్ గారు కనుక సీఎం అయితే ఆ కుర్చీకే ఓ కల వస్తుందని,పవన్ కళ్యాణ్ గారు సీఎం అయినా కాకపోయినా ఆయన ఎప్పుడు టాప్ పొజిషన్లోనే ఉంటారంటూ పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం గురించి లయ తన అభిప్రాయాలను తెలియజేశారు.ఈ సందర్భంగా పవన్ ముఖ్యమంత్రి అవ్వడం గురించి లయ చేసినటువంటి ఈ కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక పవన్ కళ్యాణ్ గురించి ఈమె చేసిన ఈ కామెంట్స్ విన్నటువంటి మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube