రజనీ 'లాల్ సలాం'లో అలనాటి హీరోయిన్.. 33 ఏళ్ల తర్వాత రీఎంట్రీ!

సూపర్ స్టార్ రజనీ కాంత్ గురించి ఇండియన్ వైడ్ గా ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పని లేదు.ఈయన కోలీవుడ్ స్టార్ అయినప్పటికీ ఇండియన్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకుని ఫ్యాన్స్ చేత సూపర్ స్టార్ గా మన్ననలు పొందుతున్నాడు.

 Veteran Telugu Actress To Act As Rajini's Sister In Lal Salaam, Lal Salaam, Jeev-TeluguStop.com

మరి ఈయన సినిమాలంటే ఫ్యాన్స్ కు ఎంత క్రేజ్ ఉంటాయో అందరికి తెలుసు.ప్రెజెంట్ ఈయన ‘జైలర్’ సినిమా చేస్తూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ హైప్ నెలకొంది.తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.సన్ పిక్చర్స్ వారు భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇదిలా ఉండగా రజనీకాంత్ తన కూతురు కోసం ఆమె తెరకెక్కిస్తున్న సినిమాలో కీలక రోల్ ప్లే చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

రజినీకాంత కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ”లాల్ సలాం”.

Telugu Actressjeevitha, Lal Salaam, Rajinikanth, Veterantelugu, Vishnu Vishal-Mo

ఈ సినిమా ఇటీవలే గ్రాండ్ గా పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయ్యింది.ఈ సినిమాలో విష్ణు విశాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.అలాగే రజనీకాంత్ ను కీలక రోల్ కోసం ఎంపిక చేసుకున్నారు.

ఇదిలా ఉండగా ఈ సినిమాలో అలనాటి నటి జీవిత రాజశేఖర్ ముఖ్యపాత్రలో నటిస్తుంది అని తెలుస్తుంది.దాదాపు 33 ఏళ్ల తర్వాత ఈమె మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యింది.1990లో చివరిసారిగా మగాడు అనే సినిమాలో కనిపించిన జీవిత ఆ తర్వాత మళ్ళీ ముఖానికి మేకప్ వేసుకుని కెమెరా ముందుకు వచ్చి నటించలేదు.

Telugu Actressjeevitha, Lal Salaam, Rajinikanth, Veterantelugu, Vishnu Vishal-Mo

కానీ ఇన్నేళ్ల తర్వాత ఈమె లాల్ సలాం సినిమాలో రాజనీకాంత్ సోదరిగా నటించ బోతుంది అని మార్చి 7 నుండి చెన్నై లో స్టార్ట్ కాబోతున్న షూట్ లో జాయిన్ కాబోతుంది అని తెలుస్తుంది.మరి ఈమె పాత్ర ఎలా ఉంటుందో.ఎలా మెప్పిస్తుందో.

రీ ఎంట్రీ ఎంత వరకు కలిసి వస్తుందో వేచి చూడాలి.ఇక లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

చూడాలి ఈ సినిమాతో ఐశ్వర్య రజనీకాంత్ ఎలా ఆకట్టుకుంటుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube