ట్యాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి జాతిరత్నాలు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి రెండేళ్లు అవుతోంది.అయినా కూడా ఇప్పటి వరకు నవీన్ తన తదుపరి సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడంలో సఫలం కాలేక పోయాడు.
హీరోగా నవీన్ పొలిశెట్టికి మంచి విజయాన్ని జాతిరత్నాలు సినిమా తెచ్చి పెట్టినా కూడా ఇప్పుడు ఆయన తదుపరి సినిమా విషయంలో మాత్రం స్పష్టత రావడం లేదు.అందుకు కారణం కేవలం అనుష్క అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
సోషల్ మీడియాలో నవీన్ పొలిశెట్టి తదుపరి సినిమా ఎప్పుడు అంటూ పదే పదే అభిమానులు ప్రశ్నిస్తున్నారు.అయినా కూడా నవీన్ పొలిశెట్టి నుండి మాత్రం రెస్పాన్స్ రావడం లేదు.
నవీన్ పొలిశెట్టి యొక్క సినిమా లో అనుష్క కీలక పాత్రలో నటిస్తుంది.ఆమె చెఫ్ గా నటిస్తున్నట్లుగా ఇప్పటికే యూనిట్ సభ్యులు తెలియజేశారు.
సినిమా లో ఆమె పాత్ర కు ఉన్న ప్రాముఖ్యత నేపథ్యం లో ఆలస్యం అవుతుంది అనే ప్రచారం జరుగుతోంది.

ఈ మధ్య కాలంలో అనుష్క అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటుంది.ఆ కారణంగా అనుష్క ఇప్పట్లో షూటింగ్ కు హాజరు అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.అందుకే నవీన్ పొలిశెట్టి సినిమా చాలా ఆలస్యం అవుతుంది అనే ప్రచారం జరుగుతోంది.
ఈ సినిమా లో నవీన్ విభిన్నమైన గెటప్ మరియు పాత్రలో కనిపించబోతున్నట్లుగా ఇప్పటికే ఫస్ట్ లుక్ ద్వారా క్లారిటీ ఇవ్వడం జరిగింది.

నవీన్ పొలిశెట్టి యొక్క సినిమా కోసం ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.కానీ అనుష్క వల్ల సినిమా ఆలస్యం అవుతోంది.ఈ సినిమా కంటే నవీన్ మరో సినిమా లో కూడా నటిస్తున్నాడు.
ఆ సినిమా మొదటగా వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది.







