వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో పీజీ విద్యార్థి ప్రీతి విద్యార్థుల ఆకతాయిలను భరించలేక ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.అయితే ఈమె ఐదు రోజులపాటు హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో మృత్యులతో పోరాడుతూ ఆదివారం సాయంత్రం కన్నుమూశారు.
ఈ విధంగా ప్రీతి మరణించడంతో ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ విషయం సంచలనంగా మారింది.పోలీసులు కళాశాల యాజమాన్యాలు సరైన సమయానికి స్పందించకపోవడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది అంటూ పెద్ద ఎత్తున కళాశాల యాజమాన్యాల తీరుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఈ క్రమంలోనే ప్రీతి మరణం పై స్పందించినటువంటి ప్రభుత్వం వారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు.ప్రీతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని, అలాగే తన కుటుంబానికి 30 లక్షల రూపాయల పరిహారం కూడా ప్రకటించారు.అయితే ఈ విషయంపై సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు.ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా ఈ విషయం గురించి మాట్లాడుతూ… మెడికో విద్యార్థి ప్రీతి మరణ వార్త బాధాకరం.
ప్రభుత్వం ఆమె మరణానికి 30 లక్షల ప్రకటిస్తూ తమ ఇంట్లో ఒకరికి గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తామని హామీ ఇవ్వడంతో కాస్త ఊరట కలిగింది.
ఇలా మరణించిన ప్రీతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంది.మంచిదే మరి చిన్నారి ప్రదీప్ కుటుంబం పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు.ప్రదీప్ కుటుంబానికి సాయం ఎక్కడ అంటూ ప్రశ్నించారు.
ప్రసుత్తం ఈ ట్వీట్ వైరలవుతోంది.చాలా మంది నెటిజనులు ఆర్జీవీకి మద్దతు తెలుపుతున్నారు.
అయితే ఈ ఘటన జరిగినప్పటి నుంచి వర్మ చిన్నారి ప్రదీప్ కు మద్దతుగా నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే చిన్నారి ప్రదీప్ కు ప్రభుత్వం నుంచి సహాయం అందాలని తనకు న్యాయం జరగాలనీ చిన్నారి ప్రదీప్ కు మద్దతుగా నిలబడుతున్నారు.