తండ్రి అయిన స్టార్ రైటర్.. శుభాకాంక్షలు చెప్తున్నా అభిమానులు!

స్టార్ రైటర్ గోపి మోహన్ గురించి ఏమైనా అందరికి తెలిసిందే.తెలుగులో వెంకీ, ఢీ,రెడీ,దూకుడు, లక్ష్యం, అల్లుడు శీను, లౌక్యం వంటి సినిమాలకు స్క్రీన్ ప్లే రైటర్ గా పనిచేసే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు గోపి మోహన్.

 Star Writer Gopi Mohan Became A Father , Gopi Mohan , Star Writer Gopi Mohan , G-TeluguStop.com

ఇది ఇలా ఉంటే గోపి మోహన్ తండ్రి అయ్యారు.గోపి మోహన్ సతీమణి ప్రవీణ తాజాగా ఒక పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.

కొడుకు పుట్టిన ఆనందంలో ఆ చిన్నారిని ఎత్తుకొని ముద్దాడుతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తూ గోపి మోహన్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇక అభిమానులు నెటిజన్స్ బుల్లి గోపి మోహన్ పుట్టాడు అంటూ ఆనందంతో కామెంట్ చేస్తున్నారు.గోపి మోహన్ విషయానికొస్తే.

కెరియర్ మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ ను స్టార్ట్ చేసిన గోపి మోహన్ యమజాతకుడు, వంశీ,నువ్వు నేను లాంటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా వ్యవహరించారు.ఆ తర్వాత 2002లో విడుదల అయిన సంతోషం సినిమాతో స్క్రీన్ ప్లేయర్ గా మారారు.

ఈ నేపథ్యంలోనే వెంకీ, దుబాయ్ శీను, అశోక్, కింగ్, నమో వెంకటేశాయ,డిక్టేటర్,ఓహ్ బేబీ, లాంటి సినిమాలకు స్క్రీన్ ప్లే రైటర్ గా పనిచేసే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు గోపి మోహన్.కేవలం తెలుగు భాషలో మాత్రమే కాకుండా కన్నడ తమిళం హిందీ భాషల సినిమాలకు కూడా స్టోరీ రైటర్ గా పనిచేశారు.ప్రస్తుతం గోపి మోహన్ తన కొడుకుని ఎత్తుకొని నవ్వుతూ ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇప్పటికే ఆ ఫోటోపై బండ్ల గణేష్ వరుణ్ సందేశ్ లాంటి సెలబ్రిటీలు సైతం స్పందించారు.

ఈ క్రమంలోనే బండ్ల గణేష్ అందుకు సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ కంగ్రాచులేషన్స్ గోపి మోహన్ గారు అని కాప్షన్ ని కూడా రాసుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube