అదేం డ్రెస్ రష్మిక... రష్మిక డ్రెస్ పై ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!

కన్నడ చిత్ర పరిశ్రమలో రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన కిరిక్ పార్టీ సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమయ్యారు నటి రష్మిక మందన.

ఈ విధంగా మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అనంతరం తెలుగులోకి కూడా చలో సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు.

ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో అనంతరం గీతాగోవిందం సరిలేరు నీకెవ్వరు భీష్మ వట్టి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వరుస హిట్ సినిమాలను అందుకున్నటువంటి రష్మిక ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇలా ఈమె కన్నడ తెలుగు చిత్రాలలో మాత్రమే కాకుండా తమిళం హిందీ సినిమాలలో కూడా నటిస్తున్నారు.అలాగే పాన్ ఇండియా చిత్రం పుష్ప సినిమా ద్వారా మరింత గుర్తింపు సంపాదించుకున్నటువంటి రష్మిక తాజాగా నెటిజెన్ల ట్రోలింగ్ కి గురవుతున్నారు.తాజాగా ముంబైలో జరిగిన జీ సినీ అవార్డు వేడుకలలో భాగంగా రెడ్ కార్పెట్ పై రష్మిక తళుకుమన్నారు.

అయితే ఈ అవార్డు వేడుకలలో భాగంగా రష్మిక ధరించిన డ్రెస్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

ఈ కార్యక్రమానికి ఈమె ఎద భాగం నుంచి తొడల వరకు మాత్రమే ఉన్నటువంటి పొట్టి దుస్తులను ధరించారు.అలాగే ఈ డ్రెస్ కు వెనుక భాగాన ఒకప్పుడు రాణిలు ధరించే విధంగా ఒక మేలి ముసుగు లాంటి దాన్నీ ధరించింది.దీంతో ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు ఈ ఫోటోలపై రష్మికను ట్రోల్ చేస్తున్నారు.

అసలు ఇదేం డ్రెస్ రష్మిక అంటూ కొందరు కామెంట్లు చేయగా.ఈ డ్రెస్సులో ఎంతో అందంగా ఉన్నావంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.ఇక రెడ్ కార్పెట్ పై ఈమె బెల్లంకొండ శ్రీనివాస్ కు వంగి మరీ హగ్ ఇస్తూ అందాలను ఆరబోశారు.

ప్రస్తుతం ఈ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈమె డ్రెస్ పై పలువురు నేటిజెన్లు ట్రోల్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు