తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికాలో సందడి చేస్తున్నారు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు కార్యక్రమంలో భాగంగా రామ్ చరణ్ అవార్డు ప్రజెంటేటర్ గా పాల్గొనడం ఎంతో గర్వకారణంగా మారింది.
ఈ విధంగా హాలీవుడ్ దర్శక నిర్మాతలతో పాటు ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ పాల్గొని ఆయన చేతుల మీదుగా అవార్డు అందించడం తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో గర్వకారణంగా మారిందని చెప్పాలి.ఇక ఈ అవార్డు వేడుకలలో భాగంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన RRR సినిమా ఏకంగా 5 అవార్డులను అందుకోవడం విశేషం.

ఇలా ప్రస్తుతం రామ్ చరణ్ పేరు ఎల్లలు దాటి మారుమోగిపోతూ ఉండడంతో ఈ విషయంపై మెగా హీరోలు స్పందిస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే మెగా బ్రదర్ నాగబాబు సైతం చరణ్ తో తాను కలిసి దిగినటువంటి ఫోటోని షేర్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్ పై ప్రశంసల వర్షం కురిపించారు.ఈ క్రమంలోనే నాగబాబు స్పందిస్తూ నా ప్రియమైన చరణ్ బాబు… మన కుటుంబ వారసత్వాన్ని అంతర్జాతీయ తీరాలకు చేర్చుతూ మంచి గుర్తింపు తెచ్చుకొని మా అందరిని గర్వపడేలా చేశావు అంటూ అబ్బాయి పై బాబాయ్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

రామ్ చరణ్ ఎన్టీఆర్ నటించిన RRRసినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ఇప్పటికే ఎన్నో అవార్డులను అందుకోగా ఈ సినిమాలోని నాటు నాటు పాట ఏకంగా గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకొని ఆస్కార్ నామినేషన్ లో కూడా నిలిచిన సంగతి తెలిసిందే.అయితే మార్చి 12వ తేదీ ఈ ఆస్కార్ అవార్డులను ప్రకటించబోతున్నారు.ఈ క్రమంలోనే రామ్ చరణ్ అమెరికాలో పలు షోలలోనూ అలాగే ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.







